వివస్త్రంగా ఆమెను చూడలేకపోయిన బాయ్ ఫ్రెండ్
ప్రముఖ పాప్ సింగర్ షకీరా తాజా ఆల్బమ్ 'షి ఊల్ఫ్' హాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి అలా వుంచితే, ఆమె జీవితంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆల్బమ్ లో వివస్త్రంగా చేసిన ఓ డాన్స్ సీక్వెన్స్ చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆంటోనియో డీ లా రుయా దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడట. ఈ విషయాన్ని స్వయంగా షకీరాయే తెలిపిందని డైలీ ఎక్స్ ప్రెస్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది.
ఈ ఆల్బమ్ లో ఆమె ఓ డాన్స్ సీక్వెన్స్ లో ఓ బోనులో వివస్త్రంగా డాన్స్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన ఆమె గారి ప్రియుడు తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కనీసం ఓ స్కార్ఫ్ అయినా వేసుకోలేకపోయావా అని అడిగాడట. కానీ ఈమె మాత్రం అతని బాధను చాలా లైట్ తీసుకున్నట్టు అనిపిస్తోంది. తను తిరిగి ఇలాంటి వీడియోలలో నటించడానికి సిద్ధం అని తెలుపకనే తెలిపింది.
షకీరా పాప్ రారాణి హాలీవుడ్ షి ఊల్ఫ్ ఆంటోనియో డీ లా రుయా shakira pop queen hollywood she wolf antonio de la rua


Click it and Unblock the Notifications