పదకొండు సంవత్సరాలు డేటింగ్ చేసి విడిపోతున్న పాప్ సింగర్
కోలంబియా సింగర్ షకీరా పదకొండు సంవత్సరాలు డేటింగ్ చేసినటువంటి తన సోగసుగాడు యాంటోనియో డి లా రూ తో విడిపోవడానికి నిర్ణయం తీసుకుందంట. ఈవిషయాన్ని స్వయంగా తనే తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆగస్టు 2010నుంచి షకీరా మరియు యాంటోనియో ఇద్దరూ వాళ్శ యొక్క రోమాంటిక్ రిలేషన్ షిప్ కుకూడా చాలా దూరంగా ఉంటున్నామని తెలిపారు. ఈవిషయాన్ని ఇప్పటివరకు కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే చాలా ప్రయివేటుగా సీక్రెట్ గా ఉంచడం జరిగిందని అన్నారు. అగస్టు నుండి కూడా మేమిద్దరం ఎవ్వరి పనులు వారు చూసుకుంటూ జీవించామని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం మేము విడిపోయినది కేవలం నామమాత్రమేనని, రాబోయే కాలంలో మరలా మేము ఎప్పుడైనా కలసిపోవచ్చునని అన్నారు. ఇలా విడిపోయవడానికి కారణం ఒకరి కాళ్శ మీద ఒకరు నిలబడి మా బిజినెస్ లలోగాని, ప్రోఫెషనల్ జీవితాలలో అభివృద్ది సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఈనిర్ణయం తీసుకున్నామని అన్నారు. మా మద్య ఉన్నటువంటి ఈప్రెండ్ షిప్ నుగాని, సంబంధాన్నిగాని ఎవ్వరూ విడదీయలేరని అన్నారు.


Click it and Unblock the Notifications











