మారియా షరపోవా ఎంగేజ్ మెంట్ రింగ్ ఖరీదు అంత ఎక్కువా..!

By Nageswara Rao

మారియా షరపోవా ప్రపంచం మొత్తం మీద టెన్నిస్ ఆట ఆడే క్రీడాకారిణిలలో కెల్లా మంచి అందగత్తె. అందం మాత్రమే ఆమె సోంతం కాదు ఆటలో కూడా చాలా సార్లు తన ప్రతాపం చూపించింది. ప్రస్తుతం 23 ఏళ్ల మారియా షరపోవా ప్రపంచ ర్యాంకింగ్ లో 18వ స్థానంలో ఉంది. షరపోవా 2004లో వింబుల్డన్ విజేతగా నిలిచింది. 2006లో అమెరికా ఓపెన్ విజేతగా, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది.

ఇటీవల కాలంలో ఈ రష్యా క్రీడాకారిణి పెళ్లి చేసుకోబోతున్నదన్న వార్తలు రావడం తోపాటు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయిందన్న సంగతి మన అందిరికి తెలిసిందే. ఇంతకీ ఎవరా ఆ అదృష్టవంతుడా అనుకుంటున్నారా లాస్ ఏంజెల్స్ లేకర్స్ గార్డు సశా వుజాసిక్ షరపోవాను పెళ్లి చేసుకోబోతున్న విషయం ఇటీవలే మారియా షరపోవా దృవీకరించింది. సశా వుజాసిక్ ఎంగేజ్ మెంట్ కిసంబంధించి మారియా షరపోవాకి డాలర్ 250,000 విలువగల అత్యంత ఖరీదైన ఉంగరాన్ని బహుకరించాడంట. దీనిపై మారియా షరపోవా తను పట్టలేని ఆనందానికి లోనవుతున్నట్లు చెప్తున్నారు.

న్యూయర్క్ లోని ఎసిఇ అవార్డుల కార్యక్రమానికి వచ్చినటువంటి మారియా షరపోవా మాట్లాడుతూ నాజీవితంలో ఈసాయంత్రాన్ని ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. ఈఉంగరం మరియు అతనితో ఉన్న సంబంధం ఎప్పటికీ నాజీవితంలో గుర్తుండిపోయేలాగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అదే సందర్బంలో జ్యూయలరీ ఎక్పర్ట్ మైఖెల్ మాట్లాడుతూ అన్ని రింగులలా కాకుండా ఈరింగులో చాలా స్పెషాలిటీ ఉందని అన్నారు. కుషన్ కట్ డైమండ్ కలిగిఉండి ఏడు నుంచి ఎనిమిది క్యారెట్ల తో ప్లాటినమ్ బాండ్ కలిగి ఉండడంతో దీని విలువ 250,000 డాలర్లు ఖరీదు ఉందన్నారు.

అంతేకాకుండా ఈరింగుని సశా వుజాసిక్ తను ఒక్కరే వెళ్శి షాపింగ్ చేయడం ఇంకా నాకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రస్తుతం మేము ఎంగేజ్ మెంట్ అయిన ఆనందంలో ఉన్నాం. మేమిద్దరం చివర వరకు కలసిజీవించాలని కోరుకుంటున్నామని తన మనసులోని భావాలను వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X