ముందు హీరోతో పడుకో.. స్క్రీన్‌పై కెమిస్ట్రీ ఫుల్ వర్కవుట్.. గదిలోకి తీసుకెళ్లి.. నిర్మాతపై హీరోయిన్ ఫైర్!
ప్రపంచ సినీ అభిమానులకు శృంగార దేవతగా మారిన హీరోయిన్ షెరాన్ స్టోన్ తాజాగా వార్తల్లో నిలిచింది. బేసిక్ ఇన్‌స్టింక్ట్‌తో యువతను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పుడు వివాదాస్పద సంఘటనలు బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. తన ఆత్మకథ ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనే పుస్తకంలో సంచలన విషయాలను బయటపెట్టేందుకు రెడీ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

40 ఏళ్ల చేదు అనుభవాలు పుస్తకంగా
హీరోయిన్ షెరాన్ స్టోన్ వెండి తెర జీవితం ఎవరికీ తెలియంది కాదు. అయితే తెర వెనుక గత 40 ఏళ్ల కెరీర్‌లో జరిగిన అన్యాయాలు, మోసాలు, సినీ ప్రముఖులు, దర్శకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఈ పుస్తకం మార్చి తేదీన రిలీజ్ కానున్నది.

దర్శక, నిర్మాతల నిర్వాకంపై ధ్వజం
తన జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా వస్తున్న ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ పుస్తకంలో బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో సన్నివేశంతోపాటు దర్శకులు, నిర్మాతల వ్యవహార తీరును బట్టబయలు చేసింది. ప్రస్తుతం ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు విడుదలకు ముందే సంచలనంగా మారాయి.

ఆత్మకథలో సంచలన విషయాలు..
ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ పుస్తకంలో ఓ నిర్మాతపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సినిమాలో నటించడానికి ముందు హీరోతో పడుకోమని నిర్మాత సూచించాడు. అలా హీరోతో పడుకొంటే తెర మీద కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని సూచించాడు. దాంతో నేను నిరాకరించాను అని షెరాన్ స్టోన్ తెలిపారు.

నన్ను గదిలోకి తీసుకెళ్లి ...
ఇక ఆ నిర్మాత తనను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. సినిమాలో శృంగార సన్నివేశాలు పండేందుకు సహకరించాలంటూ నా వెంటపడ్డారు. ఓ రోజు గదిలోకి తీసుకెళ్లి ఎందుకు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలో అనే విషయంపై చర్చించాడు. కానీ సినిమా కోసం ఒకరి బెడ్‌పైకి వెళ్లడానికి నిరాకరించాను అని షెరాన్ స్టోన్ అన్నారు.

ఆ నిర్మాత ఎవరంటే...
అయితే షెరాన్ స్టోన్ ఆరోపణలు చేసిన నిర్మాత రాబర్ట్ ఇవాన్స్ అంటూ హాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమా సిల్వర్ అని చెప్పుకొంటున్నారు. హాలీవుడ్‌లో సంచలనం రేపిన లవ్ స్టోరి, ది గాడ్ ఫాదర్ చిత్రాలకు రాబర్ట్ ఇవాన్స్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే సిల్వర్ సినిమా 1993లో బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.


Click it and Unblock the Notifications











