50 వయసులో కూడా కుర్రాళ్లతో డేటింగ్..
53 సంవత్సరాల వయసు కలిగిన షెరాన్ స్టోన్ తన కంటే వయసులో తక్కువ వాడైన కుర్రవాడితో కాలిఫోర్నియాలో డేటింగ్ చేస్తుందని సమాచారం. తన కుర్ర బాయ్ ప్రెండ్‌ని ఊర్రూతలూగించేందుకు గాను, షెరాన్ స్టోన్ పాము రంగు కలిగిన హై హీల్స్, హ్యాండ్ బ్యాగ్‌తో పాటు డార్క్ వాష్ డెనిమ్ జీన్స్, వైట్ షర్ట్‌తో ఫర్ ఫెక్టుగా అతనికి సరిపోయే విధంగా అలంకరించుకుందని సమాచారం.
ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యివేసుకొని కాలిఫోర్నియా వీధులన్నీ చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. షెరాన్ స్టోన్ గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. షరాన్ స్టోన్ ఒకప్పటి హాలీవుడ్ అందగత్తె. ఫ్యాషన్ రంగానికి ఓ సరికోత్త నడకలు నేర్పారు మన షరాన్ స్టోన్. తన నటనతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో షరాన్ స్టోన్ ఓ సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
52సంవత్సరాలు వయసులో కూడా తాను కుర్ర హీరోయిన్లుకు తీసిపోనంటూ ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి ఫైవ్ బక్స్ ఎడే అనే సినిమాలో బికిని వేసి తన అభిమానులను ఆశ్ఛర్యపరిచారు.


Click it and Unblock the Notifications











