»   » జేమ్స్ బాండ్ ప్రక్కన హిరోయిన్ అవకాశం కొట్టేసిన యువ అందగత్తె...!?

జేమ్స్ బాండ్ ప్రక్కన హిరోయిన్ అవకాశం కొట్టేసిన యువ అందగత్తె...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డానియల్ గ్రెగ్ ఈ పేరు మన అందరకి సుపరిచితం. జేమ్స్ బాండ్ గా డానియల్ గ్రెగ్ మన తెలుగు వారి గుండెల్లో తన దైన ముద్ర వేశారు. ఇలాంటి జేమ్స్ బాండ్ ప్రక్కన హిరోయిన్ అవకాశం అంటే మాటలా. హాలీవుడ్ లో 'ది మిలినియమ్ ట్రైయాలజి'అనే నవల $5మిలియన్ డాలర్లు వసూలు ఎన్నో రికార్డులు నమెదు చేసింది. ప్రఖ్యాత నవలా రచయిత 'స్టైగ్ లార్సన్'రచించినటువంటి 'ది మిలినియమ్ ట్రైయాలజి'నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపోందించడం జరుగుతుంది. ఈ సినిమా పేరు 'ది గర్ల్ విత్ ద డ్రాగన్ టాటు' గా పెట్టడం జరిగినది. ఇందులో హిరోయిన్ గా ప్రఖ్యాత హాలీవుడ్ బ్రిటిష్ హిరోయిన్ క్యారీ ముల్లింగన్ ను కాదని రూని మారా ఆ ఛాన్సు కొట్టేసింది.

ఇందులో రూని మారా జీనియస్, బాగా తెలివితేటలుగల అమ్మాయిగా నటిస్తుందని, అలాగే డానియల్ గ్రెగ్ జర్నలిస్ట్ గా కనిపిస్తారని దర్శకుడు డేవిడ్ ఫించర్ చెప్పారు. ఈ చిత్రం మెదటి నుండి చివరి వరకు ఉత్కంఠగా ప్రేక్షకులను అలరుస్తుందని షూటింగు వచ్చెనెల నుండి స్వీడన్ లో చిత్రికరిస్తామని ఆ చిత్ర దర్శకుడు డేవిడ్ ఫించర్ చెప్పారు. వేసవి సెలవులకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగినది. అలా ఐతే మన జేమ్స్ బాండ్ డానియల్ గ్రెగ్ ని చూడడానికి ఇంకోంత కాలం ఆగాల్సిందేనన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu