చివరకు ఆమెనే టాప్ సెలబ్రెటీని చేశారు..
ప్రపంచంలో అందరికంటె అందగత్తె ఎవరు అనే సందేహంతో ఇటీవల హాలీవుడ్ లో ఒక సర్వే నిర్వహించారు. ఈ అందాల పోటీలో అభిమానులను మీకు నచ్చిన మీరు మెచ్చిన అందమైన అందగత్తె ఓటు వేయవలసినదిగా అభిమానులనకు సూచించారు. ఈ అందాల పోటీలో అందరికంటే ఎక్కువ శాతం సంపాదించిన మెట్ట మెదటి స్థానంలో నిలుచుంది మన అందాల రాక్షసి నోమి వాట్స్. ఈ పోటీలో ఏంజలీనా జోలీ, పమెలా ఆండర్సన్, క్రిస్టినా ఆక్విలేరా, జాన్సన్ లాంటి మహ మహ అందగత్తెలను కాదని అభిమానులు నోమి వాట్స్ ని గెలిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని పోటీ నిర్వహించిన నిర్వహకులు తెలియజేశారు.
నోమి వాట్స్ గురించి మనం మట్లాడికునే ముందు తను చేసిన సేవా కార్యక్రమాలను ముందగా మాట్లాడుకోవాలి. 2006 వసంవత్సరంలో తను యుయన్ ఎయిడ్స్ కి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించింది. ఆ సమయంలో తను ప్రపంచం మొత్తం ఎయిడ్స్ గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి తన వంతు సహకారాన్ని అందించింది. అలాగే ఈ వ్యాధితో బాధ పడుతున్న వారికి తన వంతు సహాయం చేసింది. అలాగే ఎయిడ్స్ రెడ్ రిబ్బన్ లాంటి కార్యక్రమాలలో పోల్గోనడమే కాకుండా, వారి కోసం విరాళాలు కూడా సేకరించింది.


Click it and Unblock the Notifications











