బ్రాండ్ అంబాసిడర్ బారీమోర్ ది అంత ఛీప్ డ్రస్సా..?
'డ్రూ బారీమోర్' తన చిన్ననాటి నుండే హాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకుంది. ఈమె ఎవరో కాదు ఒకానోకప్పుడు హాలీవుడ్ అందగాడు 'జాన్ బారీమోర్' మనుమరాలు. బారీమోర్ హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 2007 'పీపుల్స్ మ్యాగజైన్' కవరు పేజి పై అందగత్తె గా దర్శనమిచ్చారు. అలాగే కాకుండా బారీమోర్ 2007లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించారు. ఈ ప్రోగ్రామ్ కీ గాను డ్రూ బారీమోర్1మిలియన్ డాలర్లును విరాళంగా యిచ్చారు.
ఇటీవల బారీమోర్ ని ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా ఆహ్వానించగా, ఆమె ఆ ప్రోగ్రామ్ కి వేసుకోని వెళ్శినటువంటి డ్రస్సు ఖరీదు కేవలం 15 పౌండ్లు మాత్రమేనని, తన స్నేహితురాలు ఓస్ బోర్న్ వివరించారు. ఆ డ్రస్సును ఖరీదుచేయడానికి, బారీమోర్ బేరం కూడా ఆడారని ఆమె చెప్పారు. ఇంత తక్కువ ఖరీదు డ్రస్సు వేసుకోనిరావడానికి కారణం ఏమిటో తనకి అర్థం కావడం లేదని ఆమె చెప్పారు. నాకు బారీమోర్ 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి తెలుసునని, ఇలా తాను రావడానికి ఏదో కారణం వుండవచ్చునని, ఆ డ్రస్సు లో కూడా బారీమోర్ చాలా అందంగా వుందని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











