వాలంటైన్స్ డే రోజు నన్ను రేప్ చేసారు
లాస్‌ఏంజిల్స్ : అమెరికన్ నటుడు షియా లెబోఫ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఓ మహిళ తనను రేప్ చేసిందని మీడియాకు వెల్లడించారు. గత వాలంటైన్స్ డే రోజున ఈ సంఘటన చోటు చేసుకుందట. ఓ ఆర్ట్ షో పెర్ఫార్మెన్స్ కోసం షియా లెబోఫ్ లాస్ ఏంజిల్స్‌కు వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

డాజెడ్ డిజిటల్ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో షియా లెబోఫ్ తనపై జరిగిన లైంగిక దాడి గురించి వెల్లడించారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న నేను రేప్ చేయబడ్డాను. ఆమె నేను ఉంటున్న రూమ్ లోకి వచ్చి నా బట్టలు విప్పేసి రేప్ చేయడం ప్రారంభించింది.
ఆ సమయంలో తాను సైలెంటుగా ఉండి పోవడం తప్ప ఎలాంటి ప్రతి ఘటన చేయలేక పోయానని షియా లెబోఫ్ వెల్లడించారు. ఆ సమయంలో తన గర్లఫ్రెండ్ మియా గోత్ బయటకు వెళ్లిందని షియా లెబోఫ్ వెల్లడించారు. తన జీవితంలో ఆ రోజు చాలా పెయిన్ ఫుల్ డే అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షియా లెబోఫ్.


Click it and Unblock the Notifications











