వివాదాశ్పదమయిన ఆ సెక్సీ తార నటించిన పెటా ప్రకటన

By Kuladeep

ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి జొన్నా కృపా నటించిన పెటా ప్రకటన వివాదాశ్పదమయింది. ప్రపంచంలోని మూగ జీవాల సంరక్షణార్థం ఏర్పాటయిన పెటా మూగజీవాలను హింసించవద్దనే కాన్సెప్ట్ తో ఎన్నో విభిన్నమయిన ప్రకటనలు విడుదల చేసింది. అన్నింటి ఉద్యేశం జంతువుల జీవించే హక్కును కాపాడమనే...!! కానీ ఇటీవల విడుదల చేసిన ప్రకటన పై మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్లే బాయ్ కవర్ పేజీపై ఓ వెలుగు వెలిగిన తార, హాలీవుడ్ నటి జొన్నా కృపా ఈ ప్రకటనలో నటించడం విశేషం.

ఈ ప్రకటన భావం ప్రకారం మనుషులంతా జంతువుల పట్ల ఏంజెల్స్ గా మెలగాలని ఆమె చెబుతున్నట్టు వుండే ఓ ప్రకటనని విడుదల చేసారు. ఇందులో ఆమె ఏంజెల్ లాగా తయారయి చేతిలో సిలువ పట్టుకొని వుంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న చిత్రం సదురు ప్రకటనలోనిదే. కానీ ఇలాంటి ప్రకటనలు క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసేవిగా వున్నాయని క్రిస్టియన్ వర్గాలు ఆందోళన జరుపుతున్నాయి, వెంటనే ఈ ప్రకటనను నిలిపివేయకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించింది. కానీ ఈ ప్రకటనలో మేము ఎవ్వరినీ కించపరచలేదని, కేవలం జంతువుల సంరక్షణార్థం మాత్రమే ఇలాంటి ప్రకటన విడుదల చేసామని పెటా వర్గాలు వాదిస్తున్నాయి. అయినా మంచి చెయ్యడానికి ముందుకు రాని జనాలు ఇలాంటి ఆందోళనలు చెయ్యడానికి మాత్రం ముందుకొస్తారని, ఇందులోని మంచి విషయాన్ని వదిలేసి ఇలా లేని రాద్ధాంతం సృష్టించడం తగదని వారు హితవు పలుకుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X