స్వమ్మింగ్ ఫూల్‌లో : ఆమె జస్టిన్ బీబర్ కొత్త ప్రియురాలా?
లాస్ ఏంజిల్స్: ప్రముఖ పాప్ యంగ్ సింగర్ జస్టిన్ బీబర్ తన పాత ప్రియురాలు, సింగర్ సెలీనా గోమెజ్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కుర్రాడు మరో అమ్మాయితో ఎఫైర్ మొదలు పెట్టాడు. గత కొంత కాలంగా మోడల్ హెయిలీతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వస్తున్న వస్తున్నాయి. తాజాగా ఇద్దరూ ఓ స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలు ఆడుతూ మీడియాకు చిక్కారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
స్విమ్మింగ్ ఫూల్‌లో ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపించారు. హెయిల్ వైపును ముద్దాడుతూ....ఆమెకు మసాజ్ చేస్తూ జస్టిన్ బీబర్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటులు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో ఈ విషయం క్షణాల్లో అందరికీ తెలిసి పోయింది.

రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి మూవీ డేట్ కెళ్లారు. ఇద్దరూ కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేాసరు. ఆ సమయంలో వీరి పక్కన మరో హాలీవుడ్ సెలబ్రిటీ కెండాల్ జెన్నర్ కూడా ఉన్నారు. మొత్తానికి జస్టిన్ బీబర్ కొత్త అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెట్టడం ఇపుడు ఇంటర్నేషనల్ షో బిజ్ సర్కిల్‍లో హాట్ టాపిక్ అయింది.
జస్టిన్ బీబర్ కెరీర్ విషయానికొస్తే....ప్రస్తుతం అమెరికన్ యువ పాప్ స్టార్లలో టాప్ 10లో ఉన్నాడు. త్వరలో మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ తో కలిసి ఓ ఆల్బం చేయబోతున్నాడు. జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.


Click it and Unblock the Notifications











