Just In
- 8 min ago
ఎమ్మెల్యేగా పా రంజిత్.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దం.. జాతీయపార్టీ గ్రీన్ సిగ్నల్!
- 25 min ago
యువ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్
- 37 min ago
Naandhi 11 Days Collections: క్లిష్ట సమయంలోనూ సత్తా చాటిన ‘నాంది’.. లాభాల్లోనూ నరేష్ మూవీ రికార్డు
- 42 min ago
ఆన్లైన్లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..
Don't Miss!
- Sports
17 సెకన్లలో తిప్పేశాడు.. సచిన్‌ను ఫిదా చేశాడు!!
- News
Viral Video: పేలిన అగ్నిపర్వతం: బూడిద వర్షం: నాలుగు కిలోమీటర్ల ఎత్తు..భయంభయంగా
- Finance
బంగారం ధరలు తగ్గాయి, 387% పెరిగిన దిగుమతులు: ఇన్వెస్ట్ చేయడమే మంచిదా?
- Lifestyle
ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగిన రాశిచక్ర గుర్తులు
- Automobiles
తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ బరిలో ఉత్కంఠ.. ఇండియా నుంచి ఒకే ఒక చిత్రం!
93వ ఆస్కార్ అవార్డులు ఉత్కంఠ మారుతున్నాయి. ఈ సారి ఇండియా నుంచి జల్లికట్టు, ఆకాశం నీ హద్దురా వంటివి ఆస్కార్‌కు నామినేట్ చేశారు. కానీ చివరి వరకు అవి కొనసాగలేకపోయాయి. తాజాగా జల్లికట్టు ఆస్కార్ బరి నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన కొన్ని చిత్రాలను ప్రకటించారు. తొమ్మిది కేటగిరిలో షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలను ప్రకటించారు. ఇక అసలు పోటీ ఇప్పుడు మొదలైనట్టు కనిపిస్తోంది.
ఇందులో ఒకే ఒక ఇండియన్ సినిమా ఉంది. బిట్టు అనే షార్ట్ ఫిలిం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. మహిళా సాధికారిత, వారికి ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయడం, ఇద్దరు స్కూల్ పిల్లలు, స్నేహితుల మధ్య జరిగే ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ బరిలో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. దీంతో కరిష్మా దేవ్ దూబే డైరెక్టర్‌గా పరిచయమైన ఈ మూవీని ఏక్తా కపూర్, గునీత్ మోంగా, తాహీర్ కశ్యప్ కలిసి ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు.

డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో భాగంగా 15 చిత్రాలు, డాక్యుమెంటర్ షార్ట్ సబ్జెక్ట్ కెటగిరీలో భాగంగా పది చిత్రాలు.. ఇంటర్నేషనల్ ఫిచర్ కేటగిరీలో భాగంగా 15 చిత్రాలు.. మేకప్ అండ్ హెయిర్ స్టైలీంగ్ విభాగంలో పది చిత్రాలు.. బ్యాక్ గ్రౌండ్ సోర్ 15, సాంగ్స్ కేటగిరీల్లో 15 చిత్రాల్లోంచి పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేశారు.
ఇక విజువల్ ఎఫెక్ట్స్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్స్, యానిమేటెడ్ షార్ట్ ఫిలిమ్ విభాగాల్లో పది చొప్పున చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఇక వీటికి ఓటింగ్ ప్రక్రియను మార్చి 5 నుంచి మార్చి 10 వరకు ఉంటాయట. మార్చి 15న నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తామని, ఏప్రిల్ 25న ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తామని తెలిపారు.