twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ బరిలో ఉత్కంఠ.. ఇండియా నుంచి ఒకే ఒక చిత్రం!

    |

    93వ ఆస్కార్ అవార్డులు ఉత్కంఠ మారుతున్నాయి. ఈ సారి ఇండియా నుంచి జల్లికట్టు, ఆకాశం నీ హద్దురా వంటివి ఆస్కార్‌కు నామినేట్ చేశారు. కానీ చివరి వరకు అవి కొనసాగలేకపోయాయి. తాజాగా జల్లికట్టు ఆస్కార్ బరి నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన కొన్ని చిత్రాలను ప్రకటించారు. తొమ్మిది కేటగిరిలో షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలను ప్రకటించారు. ఇక అసలు పోటీ ఇప్పుడు మొదలైనట్టు కనిపిస్తోంది.

    ఇందులో ఒకే ఒక ఇండియన్ సినిమా ఉంది. బిట్టు అనే షార్ట్ ఫిలిం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. మహిళా సాధికారిత, వారికి ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయడం, ఇద్దరు స్కూల్ పిల్లలు, స్నేహితుల మధ్య జరిగే ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ బరిలో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. దీంతో కరిష్మా దేవ్ దూబే డైరెక్టర్‌గా పరిచయమైన ఈ మూవీని ఏక్తా కపూర్, గునీత్ మోంగా, తాహీర్ కశ్యప్ కలిసి ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు.

    Shortlisted Movies in 93rd Oscar In nine categories

    డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో భాగంగా 15 చిత్రాలు, డాక్యుమెంటర్ షార్ట్ సబ్జెక్ట్ కెటగిరీలో భాగంగా పది చిత్రాలు.. ఇంటర్నేషనల్ ఫిచర్ కేటగిరీలో భాగంగా 15 చిత్రాలు.. మేకప్ అండ్ హెయిర్ స్టైలీంగ్ విభాగంలో పది చిత్రాలు.. బ్యాక్ గ్రౌండ్ సోర్ 15, సాంగ్స్ కేటగిరీల్లో 15 చిత్రాల్లోంచి పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేశారు.

    ఇక విజువల్ ఎఫెక్ట్స్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్స్, యానిమేటెడ్ షార్ట్ ఫిలిమ్ విభాగాల్లో పది చొప్పున చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఇక వీటికి ఓటింగ్ ప్రక్రియను మార్చి 5 నుంచి మార్చి 10 వరకు ఉంటాయట. మార్చి 15న నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తామని, ఏప్రిల్ 25న ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తామని తెలిపారు.

    English summary
    Shortlisted Movies in 93rd Oscar In nine categories..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X