సైమన్ కోవెల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన 'ఐటివి'..!
సైమన్ కోవెల్ పేరు వినగానే మనకు మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది ఆయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్. దాని మీద సైమన్ కోవెల్ ఎన్నో కార్యక్రమాలను రూపోందిడం జరిగింది. ఈయన జడ్జిగా వ్యవహారించినటువంటి ది x ప్యాక్టర్ అనే రియాలిటి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సైమన్ కోవెల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి నన్ను మీరు ఒక షోలోనే చూస్తారని, రెండవ షోతో నా కాంట్రాక్ట్ ఈ సంవత్సరంలో ముగుస్తుండంతో ఇక సెలవు అంటూ అంటున్నారు అనే తరుణంలో 'ఐటివి' వారు సైమన్ కోవెల్ కి బంపర్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి ఇటీవల 'ఐటివి' వారు సైమన్ కోవెల్ తో 20మిలియన్ పౌండ్ల ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అంతేకాకుండా ప్రతిసంవత్సరం 4 మిలియన్ పౌండ్ల పెంచనున్నట్లు తెలియజేశారు. ఈ కాంట్రాక్ట్ కనీసం రెండు లేదా మూడు సంవత్సరాల వరకు ఉంటుందని ఐటివి యాజమాన్యం తెలియజేశారు. ది x ప్యాక్టర్ షోతో పాటు బ్రిటన్స్ గాట్ టాలెంట్ కూడా నిర్వహించేవిధంగా ఆయన డేట్స్ ని సరిచూసుకోవడం జరిగిందన్నారు. ఐటివి మాత్రం రెండు షోలను ఒకేసారి చేసేలా ప్లాన్ చేయనుంది. ఐతే ఈ విషయం గురించి సైమన్ కోవెల్ ని అడగగా వచ్చే సంవత్సరంలో యుకె లో షో చేసే ప్రశక్తి లేదని వెల్లడించడం కోంచెం యుకె అభిమానులను నిరాశకు గురి చేసింది.


Click it and Unblock the Notifications











