మంచి పాత్రలు చాలా చేశాను, కానీ జేమ్స్ బాండ్ విలన్‌గా నటించాలి
లండన్, జూన్ 3: హాలీవుడ్‌లో విలనిజం ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న విలన్ సైమన్ పెగ్. సైమన్ పెగ్ విలనిజం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా స్టార్ ట్రెక్. 42 సంవత్సరాల వయసు కలిగిన సైమన్ పెగ్ తన నటనా జీవితంలో ఎన్నో అధ్బుతమైన పాత్రలను పోషించినప్పటికీ.. జేమ్స్ బాండ్ విలన్‌గా నటించడంలో ఉంటే మజానే వేరని అన్నారు. జేమ్స్ బాండ్ సినిమాలో అతి భయంకరంగా కనిపించే విలన్ పాత్రను పోషించాలని తన మనసులో ఉన్న మాటను వెలిబుచ్చాడు.
సైమన్ పెగ్ చాలా సినిమాల్లో మంచి వ్యక్తిగా నటించినప్పటికీ.. 'డాక్టర్ నో' సినిమాలో నటించిన నటనకు గాను తనలోనూ దుర్మార్గుడు అనే పాత్ర దాగి ఉన్నాడని తన నమ్మకాన్ని వ్యక్త పరిచాడు. అలాంటి దుర్మార్గుడు పాత్రలు వేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. నేను చాలా మంచి పాత్రలు వేసినప్పటికీ.. ఎందుకనో నా మనసు జేమ్స్ బాండ్ సినిమాలో విలన్ పాత్రను కోరుకుంటుందని అన్నాడు. ఆ పాత్ర ద్వారా చాలా నేర్చుకునే అవకాశం కలుగుతుందని చెప్పాడు.
నా భార్యకు అలెర్జీ ఉంది కాబట్టి పిల్లులతో ఎక్కువ సమయాన్ని గడపలేక పోతున్నానని అన్నాడు. సైమన్ పెగ్ ఎవరో కాదు హాలీవుడ్‌కు పలు రకాల మ్యూజిక్ చిత్రాలను అందించిన ప్రముఖ సంగీత కళాకారుడు జాజ్ కొడుకు. పెగ్ తల్లి ఒక సివిల్ సర్వెంట్. సైమన్ పెగ్‌కు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి దండ్రులు విడాకులు తీసుకున్నారు. డ్రామాలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తొలుత సినిమాల్లో కమెడియన్‌గా నటించారు.


Click it and Unblock the Notifications











