వెడ్డింగ్ గౌన్స్ బిజినెస్ ప్రారంభిస్తా: జెస్సికా సింప్సన్

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, జులై 6: హాలీవుడ్ పాప్ సింగర్ జెస్సికా సింప్సన్ ఇటీవల కాలంలో ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అమెరికా మొత్తం తన ఫ్యాషన్ ప్రపంచాన్ని విస్తరించడం, ఫ్యాషన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు గాను 'వెడ్డింగ్ గౌన్స్' పై తన దృష్టిని సారించింది. 31 సంవత్సరాల వయసు కలిగిన జెస్సికా సింప్సన్‌కి హాలీవుడ్ స్టార్ హీరో ఎరిక్ జాన్సన్‌తో నిశ్చతార్దమయింది. ఈ సంవత్సరం తరువాత వీరిద్దరి వివాహం జరగవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌ని బాగా గమనించి రాబోయే కాలంలో తనకు ఎంతో ఇష్టమైన ఫెయిరీటేల్ డిజైన్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వెడ్డింగ్ గౌన్స్ నే ప్రత్యేకంగా ఎంచుకోవడానికి గల కారణం అన్న ప్రశ్నకు గాను జెస్సికా సింప్సన్.. వాటిపై ఉన్న మక్కువే తనని ఈ బిజినెస్‌ వచ్చేలా చేశాయని తెలిపింది.

జెస్సికా సింప్సన్ టెలివిజన్ షో 'ఫ్యాషన్ స్టార్' లో కీలక పాత్ర పోషిస్తున్న స్టైలిస్ట్ 'డానియేల్ ముస్టో' జెస్సికా సింప్స్ వెడ్డింగ్ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అవును జెస్సికా సింప్సన్ వెడ్డింగ్ రోజుపై ఈమెకి ఎందుకంత ఆరాటం అని అనుకుంటున్నారా... ఆరోజు జెస్సికా సింప్సన్ ధరించే వెడ్డింగ్ గౌనుని బట్టి.. తాను ప్రారంభించనున్న డిజైన్స్ ఎలా ఉండబోతాయో తెలుస్తాయని అన్నారు.

ఆరోజు తాను ధరించిన వెడ్డింగ్ గౌను గనుక ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందినట్లేతే... గ్యారంటీగా రాబోయే కాలంలో అమ్మాయిలు అంతా జెస్సికా సింప్సన్ ఫ్యాషన్ లైన్ కోసం క్యూ కడతారని పేర్కొంది. వివాహం కాకుండానే జెస్సికా సింప్సన్ జెస్సికా సింప్సన్ మే 1వ తారీఖున 'మాక్స్ వెల్ డ్రూ' అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక తాను ఆగలేనని త్వరలోనే తాను ప్రేమించిన, కాబోయే భర్త ఎరిక్ జాన్సన్‌ను వివాహామాడేందుకు సిద్దమైనట్లు తెలిపింది. అంతేకాకుండా వీరి పెళ్లి ప్రపంచంలో జరిగిన అధ్బుతమైన పెళ్లిల్లలో ఒకటిగా ఉంటుందని పేర్కోంది.

కాబోయే భర్త ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ.. వీరిద్దరికి ఇంత వరకు పెళ్లి కాలేదు. ఐతే హాలీవుడ్‌లో పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం, పెళ్లి చేసుకోని తర్వాత విడిపోవడం లాంటివి సహాజం. ఐతే జెస్సికా సింప్సన్, ఎరిక్ జాన్సన్‌ను ఇద్దరూ ఈసంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెడ్డింగ్ డ్రస్సు అనుభవాన్ని నిజంగా నేను అనుభవించాలని కొరుకుంటున్నాను అని తెలిపింది.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X