హీరోయిన్ నగ్నంగా...ఆ మూవీ పోస్టర్ బ్యాన్ చేసారు
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ లేడీ ఇవా గ్రీన్ నటిస్తున్న 'సిన్ సిటీ' అనే హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇటీవల విడుదలై దుమారం రేపాయి. ఈచిత్రం పోస్టర్లపై ఇవా గ్రీన్ నగ్నంగా, నిప్పల్స్ కనిపించే విధంగా దర్శనం ఇవ్వడమే ఇందుకు కారణం. దీంతో అమెరికన్ మూవీ క్లాసిఫికేషన్ బోర్డు ఈ పోస్టర్లపై నిషేదం విధించారు.

ఇటీవల సినిమా ప్రచారంలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్లో ఆమె ఉల్లిపొరలాంటి షర్ట్ వేసుకుని చేతిలో రివాల్వర్ పట్టుకుని దర్శనమిచ్చింది. ఈ పోస్టర్లపై ఇవా గ్రీన్ వక్షోజాలు, నిప్పల్స్ క్లియర్‌గా కనిపించడం....అశ్లీలంగా పోస్టర్ ఉండటంతో క్లాసిఫికేషన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
అధికారులు ఈ విషయమై మాట్లాడుతూ.....పోస్టర్ అశ్లీలంగా ఉందని, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పోస్టర్లు ప్రదేశించడానికి అనుమతి లేదని, అందుకే ఈ పోస్టర్లపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం పోస్టర్ లేదని, సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటే పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రంగా పరిగణిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో ఇవా గ్రీన్‌తో పాటు జెస్సికా ఆల్బా, మికీ రోర్క్, జోసెఫ్ గోర్డోన్ నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 22న ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











