కరోనాతో ప్రముఖ సింగర్ మృతి.. తీవ్ర విషాదంలో టామ్ హాంక్స్, హాలీవుడ్

కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో ప్రముఖ గాయకుడు, సినీ గేయ రచయిత ఆడమ్ స్ల్కేసింగర్ మరణించారు. ఆయన మరణంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ సన్నిహితుడు ఇక లేరనే వార్తతో విషాదంలో మునిగిన సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో సంతాపం ప్రకటిస్తున్నారు. ఆడమ్ మృతితో హాలీవుడ్ నటుడు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆడమ్ మృతి గురించిన మరిన్నీ వివరాలు..

గాయకుడు స్ల్కేసింగర్ గురించి

గాయకుడు స్ల్కేసింగర్ గురించి

గాయకుడు స్ల్కేసింగర్ వయసు 52 సంవత్సరాలు. కొద్దికాలం క్రితం భార్యతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకొన్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తన ఆల్బమ్స్‌కు గ్రామీ, ఎమ్మీ అవార్డులు సొంతం చేసుకొన్నారు. ఆయన రూపొందించిన దట్ థింగ్ యూ డూ, మ్యూజిక్ అండ్ లిరిక్స్, జొస్సి పుస్సీక్యాట్ లాంటి ఆల్బమ్స్ మంచి ప్రజాదరణను కూడగట్టుకొన్నాయి.

సంగీత ప్రపంచానికి సేవలు

సంగీత ప్రపంచానికి సేవలు

క్రేజీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ టీవీ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఫౌంటేన్స్ ఆఫ్ వేన్ బ్యాండ్‌ను స్థాపించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంగీత ప్రపంచానికి విశేష సేవలందించిన గాయకుడు ఆకస్మిక మరణంతో పలువురు షాక్ తిన్నారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

 టామ్ హాంక్స్ ట్వీట్

టామ్ హాంక్స్ ట్వీట్

గాయకుడు స్ల్కేసింగర్ మృతితో హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. ఆయన లేకుండా ఈ సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. స్ల్కేసింగర్ లేకుండా ప్లేటోన్‌ను, దట్ థింగ్ యూ డూ ఆల్బమ్‌ను ఊహించుకోలేం. కరొనాతో మరణించారనే వార్త చాలా బాధకారం. జీర్ణించుకోలేకపోతున్నాను అని టామ్ హాంక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Recommended Video

Top 11 Cartoons In Our Childhood | Cartoon Network | Tom & Jerry | Scooby-Doo | Pokemon || Boldsky
 కరోనా నుంచి కోలుకొని యూఎస్‌కు

కరోనా నుంచి కోలుకొని యూఎస్‌కు

ఇటీవల టామ్ హాంక్స్‌ దంపతులు కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ఆస్ట్రేలియాలో షూటింగ్ సందర్భంగా కరోనా సోకడంతో గృహ నిర్బంధంలోకి వెళ్లారు. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకొని అమెరికాకు చేరుకొన్నారు. తాజాగా తన సన్నిహితుడు మరణంతో మరోసారి విషాదంలోకి జారుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X