టాలెంట్ షో న్యాయనిర్ణేతగా జడ్జి ప్యానెల్‌లో..!
హాలీవుడ్‌లో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న రియాలిటీ టాలెంట్ షో 'ది ఎక్స్ ఫ్యాక్టర్ '. ఈ రియాలిటీ టాలెంట్ షోలో జడ్జిగా వ్యవహారించాలన్నా ఓ ఛాలెంజే. ఈ టాలెంట్ షోకి గతంలో సైమన్ కోవెల్, ఆంటోనియో రైడ్ జడ్జిలుగా వ్యవహారించారు. ఐతే త్వరలో ప్రారంభం కానున్న రెండవ సీజన్ టాలెంట్ షోలో ప్రస్తుతం ఉన్న జడ్జిలతో పాటు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డెమి లోవాటా జడ్జి ప్యానెల్‌లో కూర్బోబోతున్నారు.
ఈ రెండవ సీజన్‌లో పాల అబ్దుల్ మరియు నికోలే షెర్జింజర్ స్దానంలో జడ్జిలుగా బ్రిట్నీ స్పియర్స్, డెమి లోవాటాలు వస్తున్నారు. ఈ షోని ఆవిష్కరించిన స్టీవ్ జోన్స్ మొదటి సీజన్ పూర్తైన తర్వాత తప్పుకోగా.. అతని స్దానంలో కూడా కొత్త వారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. స్టీవ్ జోన్స్ స్దానంలో సింగర్ మైలీ సైరస్ రానున్న రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి.
హాలీవుడ్ సింగర్, హీరోయిన్ డెమి లోవాటా ట్విట్టర్ పేజిలో మేకప్ లేనటువంటి ఇమేజిని పోస్ట్ చేశారు. ఇమేజిని పోస్ట్ చేసిన తర్వాత ఇమేజి క్రింద 'నో మేకప్! గుడ్ నైట్' అంటూ మేసేజ్‌ని పోస్ట్ చేసింది. గతంలో తాను అనుభవించిన కొన్ని ఇబ్బందులు తన ముఖంలో ఎక్కడా కనిపించకుండా ఎప్పుడూ హుందాగా కనిపించే డెమి లోవాటా తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











