'రియాలిటీ షో' లంటే ద్వేషం: సింగర్ 'ఆడం లెవిన్'
లండన్: హాలీవుడ్ సింగర్ 'ఆడం లెవిన్' ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ నా జీవితం ప్రస్తుతానికి సాఫీగా సాగుతుంది. అందుకు కారణం ఏమిటో తెలుసా..? ఇప్పటి వరకు నేను ఒక్క రియాలిటీ షో ని చూడకపోవడమేనని అన్నారు. మారున్ 5 సింగరైనటువంటి ఆడం లెవిన్ రియాలిటీ షో 'కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్' లాంటి వాటిని అస్సలు చూడనని ఖరాఖండిగా తెలిపాడు. ఈ రియాలిటీ షో లన్నీ కూడా ఆర్డినరిగా ఉంటాయని అన్నాడు.
మీ జీవితంలో ఎప్పడైనా రియాలిటీ షోలను చూశారా అన్న ప్రశ్నకు గాను నేను వీటి గురించి పట్టించుకోను. నేను వాటిని చూడకపోవడం వల్లనే నా జీవితం ఆనందంగా ఉందని నమ్ముతాను. రియాలిటీ షోలలో హాస్యాస్పదం ఏంటంటే అందరిని అగౌరవపరచే విధంగా ఉంటాయి. ఎవరో సూపర్ మార్కెట్‌కు వెళుతుంటే నేనెందుకు చూడాలని అన్నారు.
ఆడం లెవిన్ మారూన్ 5లో పేరు మోసిన గిటారిస్ట్. అమెరికన్ టాలెంట్ షో 'ది వాయిస్'కు కోచ్ గా వ్యవహారిస్తున్నారు. 2010 సెప్టెంబర్ 'హోవర్డ్ స్టెర్న్ షో' ఇంటర్యూలో ఆడం లెవిన్ రష్యాకు చెందిన స్పోర్ట్స్ స్విమ్ షూట్, విక్టోరియా సీక్రెట్ మోడల్ 'అన్నే వయలిస్తనా'తోఎనిమిది నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 2012లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ఆడం లెవిన్ అధికారకంగా ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











