twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యానిమేటెడ్ చిత్రానికి స్వరాన్ని అప్పిచ్చిన సింగర్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్, జూన్ 3: హాలీవుడ్‌లో నిర్మితమైన యానిమేషన్ చిత్రాలకు పాపులర్ హీరోయిన్, హీరోలు గాత్రదానం చేయడం మామూలే. ఐతే ఇప్పుడు ఈ గాత్రదానం కోవలోకి మరో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేరారు. ఆమె పేరు బేయోన్స్ నోలెస్. 'ఎపిక్' అనే యానిమేషన్ చిత్రానికి బేయోన్స్ నోలెస్ తన స్వరాన్ని అప్పు ఇచ్చింది. అంటే ఈ సినిమాలో ఓ పాత్ర తన స్వరంతో మాట్లాడుతుందన్నమాట.

    30 సంవత్సరాల వయసు కలిగిన ఈ రిథమ్ & బ్లూస్(R&B) సింగర్ ఎపిక్ చిత్రంలో క్వీన్ తార అనే పాత్రకు స్వరాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో బేయోన్స్ నోలెస్‌తో పాటు కోలిన్ ఫర్రేల్, అమంద సేప్రెండ్, జానీ నాక్స్విల్లే, జాసన్ సూడైకిస్, స్టీవెన్ టైలర్ మరియు జోష్ హుచర్సేన్‌లు ఉన్నారు.

    గతంలో 'ఐసి ఏజ్' చిత్రాలను నిర్మించిన క్రిస్ వెడ్జ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఒక వయసులో ఉన్న అమ్మాయి తనకు తాను తెలియకుండా ఒక రహస్య విశ్వం లోకి పడిపోవడం, ఆ తర్వాత ప్రత్యేక గ్రూప్ సహాయంతో ప్రపంచాన్ని ఏవిధంగా రక్షిస్తారనే ముఖ్య కథాంశంగా సాగుతుంది. అధ్బుతమైన యాక్షన్ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న ఈ యానిమేటెడ్ చిత్రం వచ్చే సంవత్సరం మే 24న ధియేటర్లలలోకి విడుదల కానుంది.

    ఇటీవల తండ్రులుగా మారిన సింగర్ జే-జడ్ 'డాడ్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకి ఎంపికయ్యారు. జనవరిలో సింగర్ జే-జడ్ భార్య బేయోన్స్ నోలెస్ 'బ్లూ ఐవి కార్టర్' అనే పాపకు జన్మనివ్వగా.. నెల వయసు కలిగిన బేబి పెర్ల్‌కు తండ్రి అయ్యాడు. దీనితో పాటు 'ప్రీమియర్ ఇన్ సెలబ్రిటీ డాడ్ ఆఫ్ ఇయర్ ప్రైజ్'కు గాను షార్ట్ లిస్ట్ అయ్యాడు.

    English summary
    Singer Beyonce Knowles has been roped in to lend her voice in an animated film titled “Epic”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X