Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ప్రైవేటుగా వివాహానికి సన్నాహాలు చేసుకుంటున్న పాప్ సింగర్
లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్తో జరగనున్న వివాహ ఫంక్షన్ని సాధ్యమైనంత వరకు ప్రైవేటు కార్యక్రమంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. గతంలో బ్రిట్నీ స్పియర్స్కు వివాహం అయినప్పటికీ.. జాసన్ ట్రావిక్తో జరిగే పెళ్లినే నిజమైన వివాహంగా పేర్కొంది. బ్రిట్నీ స్పియర్స్ మాట్లాడుతూ ఈ వివాహనికి చాలా తక్కువ మందిని ఆహ్వానిస్తున్నాం. నాకు అత్యంత ఆప్తులైన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఫంక్షన్కు రానున్నారని తెలిపింది.
బ్రిట్నీ స్పియర్స్, జాసన్ ట్రావిక్లు ఇద్దరూ కలిసి సహాజీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. అంతేకాకుండా రియాలిటీ షో 'ది ఎక్స్ఫ్యాక్టర్' కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. 30 సంవత్సరాల వయసు కలిగిన బ్రిట్ని స్పియర్స్కు ఇది మూడవ వివాహం. అంతక ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ని చేసుకోగా.. ఆ తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి నుండి స్పియర్స్ విడిపోయారు.
డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 6 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 5 సంవత్సరాలు. బ్రిటీష్ మీడియా అవుట్ లెట్ డైలీ మెయిల్ ప్రచురించిన కధనం ప్రకారం బ్రిట్నీ స్పియర్స్, జాసన్ ట్రావిక్ల పెళ్లి ఈవెంట్ వారి యొక్క సొంత పట్టణం లూసియానాలో జరగనుందని తెలిపింది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ మాత్రం ప్లానెట్ హాలీవుడ్ రిసార్ట్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.