twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్.. పుస్తక రచయిత ఐతే.. భలే భలే

    By Nageswara Rao
    |

    బ్రిటీష్ కు చెందిన స్టైలిష్ గాయకుడు ఎల్టాన్ జాన్ తన జీవితంలో జరిగిన అనుభవాలు, ధ్యానాలకు సంబంధించి ఎయిడ్స్ వ్యాధిపై ఎలా ఫైట్ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంగా మొట్టమొదటి సారి ప్రేమ నివారణ లేదు: గ్లోబల్ ఎయిడ్స్ మహమ్మారి ఎండింగ్ (Love Is the Cure: Ending the Global Aids Epidemic) అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని జులైలో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, ఈ పుస్తకంతో పాటు సింగర్ ఎల్టాన్ జాన్ స్వయంగా రికార్డ్ చేసిన ఆడియో బుక్‌ని కూడా కస్టమర్స్‌కి అందివ్వనున్నారు.

    64 సంవత్సరాల వయసు కలిగిన ఈ సింగర్ ప్రపంచంలో ఇప్పుటి వరకు మందు లేని ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ స్పందించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. నా వంతు భాద్యతగా ప్రజలలో చైతన్యం కలిగించేందుకు గాను ఈ పుస్తకాన్ని అందిస్తున్నానన్నారు. ఈ పుస్తకంలో జాన్ తనకు ఎంతో అత్యంత ప్రీతి పాత్రుడైన సన్నిహితుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ 1991లో ఎయిడ్స్ వ్యాధితో ఎలా చనిపోయాడో క్లుప్తంగా వివరించారు.

    గతంలో సర్ ఎల్టన్ జాన్ తనని తాను గే గా ప్రకటించుకొని గే అయిన ఓ సినీ నిర్మాత డేవిడ్ ఫుర్నిష్ ని పెళ్లిచేసుకున్నాడు. అంతేకాదండోయ్.. ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఆస్కార్ అవార్డులకు ముందు ఓ ప్రీ ఆస్కార్ పార్టీ ద్వారా ఫండ్స్‌ను వసూలు చేశాడు. ఇందులో మొత్తంగా 4 మిలియన్ పౌండ్ల వరకూ వసూలయిందని ఈ మొత్తాన్ని ఎయిడ్స్ బాధితుల కోసం వెచ్చించాడు.

    English summary
    Singer Elton John is writing his first book “Love Is the Cure: Ending the Global Aids Epidemic,” a collection of memories and meditations on the fight against Aids.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X