twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగో పెళ్లికి సిద్ధమైన గాయని.. రెండేళ్లుగా డేటింగ్, రొమాన్స్.. ప్రియుడికి ఎన్నో పెళ్లి అంటే!

    |

    గత రెండేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న మాజీ బేస్‌బాస్ క్రీడాకారుడు అలెక్స్ రాడ్రిగేజ్‌‌ను ప్రముఖ పాప్ గాయని జెన్నీఫర్ లోపేజ్ పెళ్లి చేసుకోబోతున్నది. తాజాగా తమ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తను లోపేజ్ సోషల్ మీడియాలో వెల్లడించడం సంచలనంగా మారింది. లోపేజ్‌కు ఇది నాలుగో వివాహం కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

    రెండేళ్లుగా జెన్నీఫర్ డేటింగ్

    రెండేళ్లుగా జెన్నీఫర్ డేటింగ్

    జెన్నీఫర్ లోపేజ్‌కు ఇప్పటికే మూడుసార్లు వివాహమైంది. 11 ఏళ్ల వయసు ఉన్న కవలలకు తల్లి కూడా. 2014లో గాయకుడు మార్క్ ఆంథోని నుంచి విడాకులు పొందినప్పటి నుంచి అలెక్స్‌తో డేటింగ్ చేస్తున్నది. అలెక్స్ కంటే లోపేజ్ రెండేళ్లు పెద్దది కావడం విశేషం.

    భార్యకు విడాకులు ఇచ్చిన అలెక్స్ రాడ్రిగేజ్

    భార్యకు విడాకులు ఇచ్చిన అలెక్స్ రాడ్రిగేజ్

    గాయకుడు అలెక్స్ రాడ్రిగేజ్ వివాహితుడే. 2008లో తన భార్య నుంచి విడాకులు పొందారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫాక్స్, బేస్‌బాల్ స్టూడియో బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ చానెల్లో క్రీడా విశ్లేషకుడిగా, బేస్‌బాల్ కోచ్‌గా అందరికి సుపరిచితుడు.

    నిశ్చితార్థం నిజమేనని

    నిశ్చితార్థం నిజమేనని

    అలెక్స్ రాడ్రిగేజ్‌తో ఎంగేజ్‌మెంట్ వార్త నిజమే. నాచేతికి అలెక్స్ తొడిగిన ఉంగరం ఇదే. నా అభిమానులకు నా పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియచేయడానికి సంతోషిస్తున్నాను అని జెన్నిఫర్ లోపేజ్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు.

    పెళ్లి తేదీ అతి గోప్యంగా

    పెళ్లి తేదీ అతి గోప్యంగా

    అయితే అలెక్స్‌తో జరిగే పెళ్లి తేది గురించి జెన్నీఫర్ గోప్యంగా ఉంచారు. అమెరికాలో జూన్ 7వ తేదీ నుంచి జూలై 26 వరకు అమెరికాలో ఆమె సంగీత కచేరీలు చేయనున్నారు. అయితే ఆ తేదీలకు ముందుగా పెళ్లి జరుగుతుందా? లేదా ఆ తర్వాత జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.

    English summary
    Jennifer Lopez and A-Rod are engaged. It will be the fourth marriage for Lopez, who divorced singer Marc Anthony in 2014, and the second for Rodriguez, who has been divorced since 2008.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X