ఒకే వేదికపై.. విడాకులు తీసుకున్న మాజీ భార్యభర్తలు
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, తన మాజీ భర్త మార్క్ ఆంటోనీ ఇద్దరూ లాస్ వేగాస్‌లో జరిగిన ఓ రియాలిటీ షో 'క్యూ వివా ది చూజెన్' లో పాల్గోని అభిమానులను అలరించారు. గతంలో భార్యాభర్తలైన ఈ జంట వేదక మీదకు రాగానే వీరిని ప్రత్యేకంగా ప్రదర్శించడంతో పాటు బిగ్గరగా చీర్స్ తో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చాలా భాగం వీరిద్దరూ సంఘీభావం చూపించారు. ఇక 'క్యూ వివా ది చూజెన్' రియాలిటీ షో విషయానికి వస్తే లాటిన్ అమెరికాలో టాలెంట్‌ని వెతికే రియాలిటీ షో.
జెన్నిఫర్ లోపెజ్ ఏడు సంవత్సరాలు కలసి ఉన్న తన భర్త మార్క్ ఆంటోని నుండి రెండు రోజలు క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తే చివరకు జెన్నిఫర్ లోపెజ్, విలియమ్ లెవీకు మద్య ఉన్న శారీరక సంబంధమే భార్యభర్తలు విడిపోవడానికి కారణం అని తెలిసింది. అమెరికన్ యాక్టర్ అయినటువంటి విలియమ్ లెవీ, జెన్నిఫర్ లోపెజ్ ఇద్దరూ కలసి 'ఐయామ్ ఇన్‌టు యు' అనే మ్యూజిక్ వీడియోలో కలసి నటించడం జరిగింది.
జెన్నిఫర్ లోపెజ్ భర్త సింగర్ మార్క్ ఆంటోనీ తన భార్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత మెక్సికన్ మోడల్ 'అడ్రియానా ఓంటివిరోస్'తో డేటింగ్ చేస్తుండగా.. 42 సంవత్సరాలు వయసు కలిగిన 'క్యాప్సర్ స్మార్ట్'తో జెన్నిఫర్ లొపెజ్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











