మ్యారేజి రూమర్స్‌పై పెదవి విప్పిన 'సింగింగ్ సెన్సేషన్'
హాలీవుడ్ సింగర్ జస్టిన్ బైబర్ ఎట్టకేలకు తన పెళ్లి వార్తలపై స్పందించాడు. ఇటీవల జస్టిన్ బైబర్ తన స్నేహితురాలు సెలీనా గోమెజ్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై జస్టిన్ బైబర్ స్పందిస్తూ నాకు పెళ్లి చేసుకునేంత వయసు ఇంకా రాలేదు. ప్రస్తుతం నేను యువకుడను. ఏదో ఒక రోజు నేను ఎవరితో ఒకరితో ఎంగేజ్ అవుతాను. రాబోయే ఐదు లేదా పది సంవత్సరాలలో నా మనసుకి నచ్చిన అమ్మాయి దొరకగానే ఆ కార్యక్రమం అటోమ్యాటిక్‌గా జరుగుతుంది.
ఐతే సెలీనా గోమెజ్ నాకు సరైన పాట్నర్ కాదా అని మాత్రం ప్రశ్నించకండి.. ఎందుకంటే ఈ విషయం తనకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఒకసారి ఫేమస్ ఐతే పబ్లిక్‌లో ఎవరితోనైనా రిలేషన్ షిప్‌ని కొనసాగించడం చాలా కష్టమని అన్నాడు. యువ వయసులో ఉండి ఏదైనా సంబంధాల్ని నెరపడం చాలా కష్టం. నేను పబ్లిక్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి నాపై వచ్చిన రూమర్స్‌కి బదులివ్వాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నాడు.
హాలీవుడ్ టీనేజ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌కు తన స్నేహితులురాలు సెలెనా గోమెజ్‌తో నిశ్చితార్థం అయిందంటూ వస్తున్న వార్తలను బైబర్ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు. అసలు ఈ వార్త రావడానికి కారణం చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ కోసం షాపింగ్ చేస్తున్నారంటూ చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్ కథనాన్ని ప్రచురించాడు.
ఈ విషయాలన్నింటిపై బైబర్ అధికార ప్రతినిధి స్కూటర్ బ్రౌన్ మాట్లాడుతూ ఇంటర్నెట్లో వస్తున్న ఈ పుకార్లు పూర్తిగా అబద్దం. ఈ రూమర్స్ పై బైబర్ టీమ్ మేట్స్ అంతా నవ్వుతున్నారని అన్నారు. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











