ఐపిఎల్ ప్రారంభ వేడుకల్లో హాలీవుడ్ పాప్ సింగర్
అమెరికన్ పాప్ సింగర్ కాటి పెర్రీ ప్రదర్శనతో ఈ ఏడాది ఐపీఎల్ ఐదో ఎడిషన్ ఆరంభ వేడుకలు అదిరిపోనున్నాయి. ఏప్రిల్ 3న జరిగే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో పాప్‌స్టార్ కాటీ పెర్రీ పాటలతో కుర్రకారును ఊర్రూతలూగించనుంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు చెన్నయ్‌లోని వైఎంసీఏ మైదానం వేదికకానుంది. 'ఐపీఎల్ ఐదో ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో పెర్రీతో ప్రదర్శన ఇప్పించనున్నాం. ఆ పాప్‌స్టార్ ప్రదర్శనతో ఈ వేడుక మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆమె సంగీతం నిర్వాహకుల ను, అభిమానులను తప్పకుండా అలరిస్తుంద'ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు.
27 సంవత్సరాల వయసు కలిగిన కాటీ పెర్రీ ఇటీవల ప్రేమించే పెళ్లి చేసుకున్న బ్రిటీష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌తో 14 నెలలు అతనితో జీవించి ఆ తర్వాత కొన్ని మనస్పర్దలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ భారతదేశంలో సాంప్రదాయబద్దంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే.
తన భర్త నుండి కాటీ పెర్రి విడిపోయిన తర్వాత గతంలో తనని ఎంతగానో ప్రేమించిన ప్రెంచ్ మోడల్ 'బాప్టిస్ట్ గియాబికోని'తో పారిస్ హోటల్స్లో చక్కెర్లు కొడుతుందని వీరిద్దరి చూసిన వారు అంటున్నారు. అంతేకాకుండా ప్రేమలో పడిన కొత్త జంట ఎలాగైతే ఉంటుందో అలానే చెట్టాపట్టాలేసుకోని వీరిద్దరూ పారిస్ వీధులన్నీ తిరిగారని వీక్షకులు తెలిపారు.
దీనితో పాటు ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా స్వయంగా డాన్స్ చేసి అభిమానులను అలరించనున్నాడు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలతో కలిసి ప్రభుదేవా స్టెప్పులు వేయనున్నాడు. మరో విశేషం ఏమిటంటే అదే రోజు ప్రభుదేవా పుట్టిన రోజు కావడం. గతంలో ఎన్నడూ ఇలాంటి పెద్ద కార్యక్రమాల్లో ప్రభుదేవా డాన్స్ చేయలేదు. తొలిసారిగా, అదీ తన పుట్టిన రోజున ఈ అవకాశం దక్కడంతో ప్రభుదేవా అద్భుతమైన స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నాడని సమాచారం.
అంతేకాకుండా వీరితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదవ సీజన్ ప్రారంభ ఉత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. 69 సంవత్సరాల వయసు కలిగిన ఈ సూపర్ స్టార్ ఇటీవల జరిగిన ఉదర శస్త్ర చికిత్సల నుండి పూర్తిగా కోలుకోని ఐపిఎల్ ఆతిధ్య ఈవెంట్ కోసం ప్రత్యేకంగా సన్నధ్దం అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











