రెండు నెలలు డేటింగ్ తర్వాత విడిపోతున్న సింగర్
లండన్: గత రెండు నెలలుగా డేటింగ్ చేసుకుంటున్న హాలీవుడ్ స్టార్ జంట సింగర్ కాటి పెర్రి, ఫేమస్ గిటారిస్ట్ జాన్ మేయర్ విడిపోయారు. గత జూన్‌లో వెస్ట్ హాలీవుడ్, సోహో హౌస్‌లో వీరిద్దరి కలిసి సంయుక్తంగా రొమాన్స్ చేసుకుంటూ పబ్లిక్ ముందు దర్శనమిచ్చారు. కాటి పెర్రి వయసు 27 సంవత్సరాలు కాగా.. జాన్ మేయర్ వయసు 34 సంవత్సరాలు.
వీరిద్దరి మధ్య కుదిరిన రొమాన్స్ మంచి సంబంధానికి దారి తీయకుండా ఇలా అర్దాంతరంగా ఆగిపోవడం బాధించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని కొన్ని విషయా్ల్లో వీరిద్దరి మధ్య సరైన అవగాహాన కుదరక పోవడం వల్లనే వీరిద్దరూ విడిపోయారని సమాచారం. ఇలా జరగడంపై కాటి పెర్రి చాలా బాధపడిందని ఆమె అధికార ప్రతినిధి తెలిపారు.
మొదటి నుండి కాటి పెర్రి.. జాన్ మేయర్‌తో సీరియస్‌గా ఉండనప్పటికీ.. విడిపోవడానికి వచ్చే సరికే కాస్త బాధించిందని చెప్పారు. తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న కమెడియన్ రస్సెల్ బ్రాండ్ కాటి పెర్రి నుండి ఈ ఏడాది మొదట్లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత వసంత కాలంలో కాటి పెర్రి రాకర్ రాబర్ట్ ఆక్రాడ్‌తో డేటింగ్ చేయడం.. ఆ తర్వాత రెండు నెలలుగా ఫేమస్ గిటారిస్ట్ జాన్ మేయర్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించారు.
ఐతే ఇది కూడా ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం. ఇక జాన్ మేయర్ విషయానికి వస్తే గతంలో జెన్నిఫర్ లవ్ హెవిట్, జెస్సికా సింప్సన్, బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌తో రొమాంటిక్ సంబంధాలు కొనసాగించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











