ఎట్టకేలకు మళ్లీ కలిసిన ఒక్కటైన జంట
లండన్, జూన్ 5: హాలీవుడ్ పాప్ సింగర్ లేడిగాగా, ఆమె మాజీ ప్రియుడు 'టేలర్ కిన్నే' ఇద్దరూ తిరిగి కలిసి పోయారని హాలీవుడ్‌లో గుస గుస లాడుతున్నారు. ప్రస్తుతం లేడిగాగా ఆసియా టూర్‌లో భాగంగా థాయ్ లాండ్, సింగపూర్‌లో స్టేజి షోలు నిర్వహిస్తున్నారు. రూమర్స్ ప్రకారం 30 ఏళ్ల టేలర్ కిన్నే ఈ టూర్‌లో లేడిగాగాతో కలిసి షోలు చేయనున్నాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఆసియా టూర్‌ని పెద్ద సక్సెస్ చేయనున్నారు. తిరిగి మళ్లీ తన జీవితంలోకి టేలర్ రావడంపై గాగా హార్షం వ్యక్తం చేసింది. ఎక్కడకి వెళ్లిన వీరిద్దరూ చేతులు కలుపుకోని వెళుతూ అభిమానులను అలరిస్తున్నారు. హోటల్లో ఉన్న ఎలివేటర్లో వీరిద్దరూ ముద్దులు పెట్టుకుంటుండగా.. వీరిని చూసి అవాక్కయ్యారు.
లేడిగాగా పుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ.. ఖాలీ దొరికిన సమయంలో ఎంజాయ్ చేస్తున్నారంట. గాగా తనని ఎంతగానో మిస్ అవుతున్నట్ల తెలిపింది. 10 నెలలు పాటు డేటింగ్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గాగా, టేలర్ ఇద్దరూ మే మొదట్లో విడిపోయిన సంగతి తెలిసిందే.
ఇటీవలే ప్రపంచంలో తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో 25 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న అరుదైన రికార్డుని హాలీవుడ్ పాప్ సింగర్ లేడి గాగా సాధించారు. వెంటనే అభిమానులకు తన కృతజ్ఞతలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 26 సంవత్సరాల వయసు కలిగిన లేడిగాగా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో "# 25milliontweetymonsters వావ్! ఈరోజు నేను అధికారకంగా ప్రపంచంలో లక్కీయస్ట్ అమ్మాయిని అయినంత ఫీలింగ్ కలుగుతుందని" ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











