ఛారిటీకి విరాళంగా డిజైనర్ బ్యాగ్స్ ఇచ్చిన హీరోయిన్స్
లండన్, మే 31: సింగర్ లిల్లీ అలెన్, పాప్ స్టార్ నుండి ఫ్యాషన్ డిజైనర్‌గా మారిన విక్టోరియా బెకహాం ఒక స్వచ్ఛంద సంస్ద కోసం వారి డిజైనర్ హ్యాండ్ బ్యాగులను విరాళంగా ఇచ్చారు. ఓ స్వచ్చంద సంస్ద కోసం విరాళాలను వసూలు చేసే భాగంలో హాలీవుడ్‌కు చెందిన మోడల్ డైసీ లూయి, స్టార్ హీరోయిన్ టిల్డా స్విన్టన్ వారి యొక్క పర్సులను ఈ ఈవెంట్‌లో వేలానికి పెట్టనున్నారు.
తద్వారా వచ్చిన మొత్తాన్ని చిన్న పిల్లల స్వచ్చంద సంస్దకు ఉచిత విరాళంగా అందివ్వనున్నారు. ఈ స్వచ్చంద సంస్ద ఎవరైతే యువ ప్రజలు కష్ట జీవితాన్ని అనుభవిస్తున్నారో వారికి మద్దతుగా నిలవనుంది. 37 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా బెకహాం ప్రముఖ పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్యగా అందరికి సుపరిచితమే. అంతేకాకుండా విక్టోరియా గతంలో స్పైస్ గర్ల్‌గా ఉన్నారు. తన భర్త డేవిడ్ బెకహాంతో కలసి నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో ముగ్గురు మగ పిల్లలు(బ్లూక్లెన్, రోమియో, క్రూజ్) కాగా.. హార్పర్ అనే అమ్మాయి ఉంది.


Click it and Unblock the Notifications











