బాయ్ ప్రెండ్ కోసం థియేటర్ అద్దెకు తీసుకున్న మడోన్నా
సిడ్నీ, జులై 11: సాధారణంగా ప్రేయసిని ప్రియడు ఆశ్యర్యపరచాలని ఆమె పుట్టినరోజుకి బహుమతులు, ఫ్లవర్స్, గిఫ్ట్ లాంటి వాటిని చాలా ఇస్తుంటారు. ఐతే ఇక్కడ రివర్స్ లో జరిగింది. హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా తన ప్రియుడు, బాయ్ ప్రెండ్ కోసం ఏకంగా అమస్టర్ డామ్ లోని ఓ ధియేటర్‌నే అద్దెకు తీసుకుంది. వివరాల్లోకి వెళితే... అమస్టర్ డామ్ లోని ఓ థియేటర్‌ను అద్దెకు తీసుకోని తన బాయ్ ప్రెండ్ 'బ్రాహిమ్ జైబాత్' కోసం ప్రత్యేకంగా సినిమా షో వేయించి అతనికి అధ్బుతమైన ఎక్స్ పీరియన్స్‌ని కలిగించింది.
53 సంవత్సరాల వయసు కలిగిన మడోన్నా ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ... సమయం దొరకబుచ్చుకోని మరీ సినిమాకి ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లింది. వీళ్లిద్దరూ కలిసి వీక్షించిన ఫ్రెంచ్ సినిమా పేరు 'ది ఇన్‌టచ్‌బుల్స్'. వీరిద్దరి కోసం ప్రత్యేకంగా థియేటర్ యాజమాన్యం ఇంగ్లీషు సబ్ టైటిల్స్ కలిగిన ప్రింట్ తెప్పించి మరీ ప్రదర్శిచారు. అమస్టర్ డామ్‌లో ఈ శని, ఆది వారాలలో స్టేజి షో ఇవ్వనున్నారు. అందులో భాగంగానే మడోన్నా అమస్టర్ డామ్‌లో ఉన్నారు.
ఇటీవల పాప్ స్టార్ మడోన్నా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ.. బెడ్ మీద నగ్నంగా ఉన్న ఓ భంగిమ ఛాయాచిత్రం అమ్మకానికి ఉద్భవించింది. నలుపు, తెలుపు రంగులలో ఉన్న ఈ ఫోటో 1990లో తీసిన ఓ అధ్బుత చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఫోటోని గనుక గమనించినట్లైతే మడోన్నా ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేకుండా నగ్నంగా తన కుడి చేతితో సిగరెట్‌ని త్రాగుతూ.. తన ఎడమ చేతిలో ఓ తెల్లని షీట్‌తో తన క్రింది భాగాన్ని దాచుకుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











