తండ్రినే కోర్టుకు లాగిన పాప్ సింగర్ రిహానా, ఏం జరిగిందంటే..?
అమెరికన్ పాప్ సింగర్ రిహానా తన తండ్రి రొనాల్డ్ ఫెంటీతో పాటు అతడి వ్యాపార భాగస్వామికి లీగల్ నోటీసులు పంపడం హాట్ టాపిక్ అయింది. అక్రమంగా తన పేరు వాడుకుంటూ ఈ ఇద్దరు ధనవంతులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
రిహానా తండ్రి రొనాల్డ్ ఫెంటీ, మోసెస్ పెర్కిన్ కలిసి 'ఫెంటీ ఎంటర్టెన్మెంట్' పేరుతో ఓ ఎంటర్టెన్మెంట్ కంపెనీ స్థాపించారు. తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వారు రిహానా ఏజెంట్లుగా చెప్పుకుంటున్నారట. 'మిస్టర్ ఫెంటీ రిహానా తండ్రి అయినప్పటికీ ఆమె ఏజెంటుగా చెప్పుకునే అధికారం అతడికి లేదు' అని రిహానా ప్రతినిధి తెలిపారు.

నా పేరు వాడుకుని...
ఇద్దరు వ్యక్తులు తన పేరు దుర్వినియోగం చేస్తూ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అనుమతి లేకుండా నా పేరు వాడుకుంటూ వ్యాపారం చేయడం చట్ట విరుద్ధమని రిహానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫెంటీ ఎంటర్టెన్మెంట్స్' సంస్థ రిహానాకు చెందినదిగా చెప్పుకుంటూ మోసపూరితంగా వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

భారీగా డబ్బు రాబట్టే ప్రయత్నం
ఫెంటీ ఎంటర్టన్మెంట్స్ సంస్థ రిహానా అనుమతి లేకుండా మూడో పార్టీతో కలిసి సంగీత కచేరీలు బుక్ చేసిందని, తద్వారా మిలియన్ల కొద్దీ డబ్బును రాబట్టే ప్రయత్నం చేసిందని లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో రిహానా ప్రతినిధులు లాసూట్ దాఖలు చేశారు.

దీన్ని సహించను
లాటిన్ అమెరికాతో పాటు లాస్ ఏంజిల్స్‌లో పలు కచేరిలు బుక్ చేయడం ద్వారా తన పేరు వాడుకుంటూ తన బ్రాండ్ వ్యాల్యూ దెబ్బతీస్తున్నారని, ఇది తాను ఎంత మాత్రం సహించబోను అంటూ రిహానా తన లా సూట్లో పేర్కొన్నారు.

యూఎస్ఏలో హాట్ టాపిక్
రిహానా, ఆమె తండ్రి రొనాల్డ్ ఫెంటీ మధ్య జరుగుతున్న ఈ వార్ యూఎస్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ వ్యవహారం చివరకు ఎక్కడి వరకు వెళుతుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











