డబ్బులెందుకు దండగ..? ఇదిగో ఫ్రీగా నగ్న ఫోటోస్.... సింగర్ సంచలనం!
ఆస్ట్రేలియన్ సింగర్ సియా నగ్న ఫోటోలు కొందరు ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టారు.
Recommended Video

ఈ మధ్య కాలంలో పలువురు సినీ సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ ఆన్‌లైన్లో లీకవుతున్న వార్తలు తరచూ వింటున్నాం. హ్యాకర్లు వీటిని ఇంటర్నెట్లో అమ్మకానికి పెడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియన్ సింగర్ సియా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది.
సింగర్ సియా నగ్న ఫోటోలను ఆమె అభిమానులకు ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయం సియా దృష్టికి వెళ్లగానే ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నగ్న ఫోటోలను తనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మీ డబ్బు సేవ్ చేసుకోండి
కొందరు నా నగ్న ఫోటోలు అభిమానులకు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అభిమానులారా మీ డబ్బు సేవ్ చేసుకోండి. మీ కోసం ఫ్రీగా ఈఫోటో పోస్టు చేస్తున్నాను. ప్రతి రోజూ మనకు క్రిస్‌మస్ పండగే అంటూ.... సియా ట్వీట్ చేశారు.

సియా నిర్ణయం హాట్ టాపిక్
తన నగ్న ఫోటోలను తనే లీక్ చేయడం, అభిమానుల డబ్బులు సేవ్ చేయడానికే తాను ఇలా చేస్తున్నాను అని ఆమె పేర్కొనడం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి కారణంతో గతంలో ఏ సెలబ్రిటీ కూడా ఇలా చేయలేదని చర్చించుకుంటున్నారు.

సింగర్ సియా
సియా ఆస్ట్రేలియాకు చెందిన సింగర్. వయసు 41. సింగర్ గా, సాంగ్ రైటర్‌గా, మ్యూజిక్ వీడియో డైరెక్టర్‌గా ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతిగాంచింది.

పబ్లిసిటీ కోసమేనా?
అయితే సింగర్ సియా న్యూడ్ ఫోటోస్ లీక్ వ్యవహారంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. 41 ఏళ్ల వయసున్న ఈ సింగర్ నగ్న ఫోటోలు అమ్మకానికి పెడితే మాత్రం కొనేవారు ఉంటారా? లేక పబ్లసిటీ కోసమే ఆమె ఈ డ్రామా క్రియేట్ చేసిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











