ప్రముఖ నటి, సింగర్ ఆత్మాహత్యాయత్నం.. అపస్మారక స్థితిలో హాస్పిటల్‌కు!
ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ తామర్ బ్రాక్ట్సన్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఎంజెలెస్‌లోని రిట్జ్ కర్లాటన్ హోటెల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో సృహకోల్పోయి పడి ఉండటాన్ని అత్యవసర వైద్య సిబ్బంది గుర్తించారు. అయితే ఆమె ఆత్మాహత్యా ప్రయత్నానికి కారణాలు వెల్లడి కాలేదు.
పోలీసుల కథనం ప్రకారం...అమెరికా కాలమానం ప్రకారం.. జూన్ 16వ తేదీ రిట్జ్ హోటల్‌లో సృహ కోల్పోయి కనిపించారు. బహుశా ఎక్కువ మోతాదులో మద్యం, నిద్రమాత్రలు మింగి ఉంటారేమో అనే అనుమానాన్ని ఆమె బాయ్‌ఫ్రెండ్ వ్యక్తం చేశాడు. ఉదయమే ఆత్మహత్య చేసుకొంటానని ఆయనను బెదిరించారు అని తెలిపారు.

అయితే తన ఆత్మాహత్యా ప్రయత్నానికి ముందు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. హోటల్‌లో అలాంటి నోట్ లభించలేదు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించాం. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నది అని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











