మ్యూజియంకు ఆమె ఉదార సాయం 2.5 మిలియన్ పౌండ్స్
టెన్నెస్సీ లోని నాష్విల్లేలో ఉన్న 'కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ మ్యూజయం' కు సింగర్ టేలర్ షిప్ట్ 2.5 మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. టేలర్ షిప్ట్ అందించిన ఈ ఉదార మొత్తంలో కొంత భాగం ఒక కళాకారుడు ఆపరేషన్ కోసం వినియోగించనున్నారు. మిగిలిన విరాళాన్ని 2014లో 'టేలర్ షిప్ట్ ఎడ్యుకేషన్ సెంటర్' లో కొత్తగా ప్రారంభించనున్న క్లాస్ రూమ్ కాంప్లెక్స్ సెట్ కోసం ఉపయోగించనున్నారు.
ఈ మధ్య కాలంలో టేలర్ షిప్ట్ ఇచ్చిన అతిపెద్ద స్వచ్ఛంద బహుమానం.
విరాళం అందుకున్న మ్యూజియం డైరెక్టర్ కేల్ యంగ్ మాట్లాడుతూ మాకు ఏదో ఒకటి చేయాలని ఉన్నప్పటికీ, మేము ఈ విరాళాన్ని ఇప్పుడు విద్య కోసం ఉపయోగిస్తాం. దీని సహాయంతో ఎక్కువ మంది లభ్దిపొందడంతో పాటు సరిక్రొత్త కార్యక్రమాలు అభివృద్ధి చేసేందుకు దొహాదపడుతుంది.
మేము టేలర్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. ఇందులో టేలర్ అందించిన సలహాలను స్వీకరించడానికి రెడీగా ఉన్నామని తెలిపాడు.
టేలర్ షిప్ట్‌కి ఈ సంస్దతో ఎప్పటి నుండో అనుబంధం ఉంది. తన జీవితంలో సింగర్‌గా తొలి దశలో ఉన్నప్పుడు ఇక్కడే బిల్డింగ్స్ ప్లాజాలో తొలి రికార్డుని నమోదు చేసిందని అన్నాడు. దేశీ మ్యూజిక్ అవార్డ్స్ విభాగంలో అకాడమీ ఆఫ్ ద ఎంటర్టైనర్ అవార్డుని అందుకున్న హాలీవుడ్ ప్రముఖ సింగర్ టేలర్ షిప్ట్ ఈ ఆనందాన్ని కుటుంబం మరియు స్నేహితులతో జరుపుకున్నారు. గాయని టేలర్ స్విఫ్ట్, నటుడు టేలర్ లూట్నర్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని హాలీవుడ్‌లో ఎన్నో రోజుల నుండీ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











