'గే' వివాహాన్ని చట్టబద్దం చెయ్యాలని పోరాటం సాగిస్తోన్న సెలబ్రిటీ..!!

By Kuladeep

లండన్ కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ సర్ ఎల్టన్ ఆయన జీవిత భాగస్వామి డేవిడ్ ఫుర్నిష్ ఓ బాలున్ని దత్తతకు తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనకి చట్టం అంగీకరించకపోవడంతో వారు చట్టాన్ని మార్చడానికి ప్రతిపాదిస్తున్నారు. కాగా 2005 వ సంవత్సరంలో ఈ పాప్ సింగర్ తనని తాను 'గే' గా ప్రకటించుకుని ఫిల్మ్ ప్రొడ్యూసర్ డేవిడ్ ఫుర్నిష్ అనే అతన్ని వివాహమాడారు. లండన్ చట్టం ప్రకారం 'గే' వివాహం చట్టబద్దం కావడం తో వారికెలాంటి ఇబ్బందులూ ఎదురవలేదు.

కానీ ఆ తర్వాత వీరుకి ఓ బాలున్ని దత్తతకు తీసుకోవాలని అనిపించింది. దీంతో వీరు ఉక్రెయిన్ లోని ఓ అనాధాశ్రమంలో పెరుగుతున్న HIV పాజిటివ్ ఉన్న 17 నెలల బాలున్ని దత్తతకు తీసుకోవాలని భావించారు. దీనికి సంతోషించాల్సింది పోయి ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దత్తతకు అడ్డుకట్ట వేసింది. కారణం ఆ దేశ చట్టం ప్రకారం 'గే' వివాహం చెల్లదు, పైగా అది ఓ నేరం క్రింద వస్తుంది. దీంతో గే జంట అయిన వీరిద్దరికీ బాబును దత్తత ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించలేదు.

కానీ ఈ విషయాన్ని ఈ జంట తీవ్రంగా పరిగణిస్తోంది. అసలే HIV తో బాధపడుతున్న బాలున్ని అనాదాశ్రమంలో వుంచడం ఏమిటి..?? మేము స్వచ్చందంగా ఆ బాబు ఆలనా పాలనా చూస్తామంటే దీనికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం బాధాకరం. అయినా ఈ విషయాన్ని మేము అంతటితో వదిలేది లేదు, ప్రభుత్వ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. దీని కోసం పోరాటానికి కూడా మేము సిద్ధం అని ప్రకటించారు. HIV బాధిత చిన్నారులను దత్తతకు అనుమతించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని వారు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని ఆశక్తిగా చూస్తున్నారంతా..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X