డ్రగ్స్ తీసుకోని చనిపోయే వాళ్శలో త్వరలో నేను కూడా చేరతాను..
రాక్ లెజెండ్ సర్ ఎల్టన్ జాన్ డ్రగ్స్ తీసుకోని చనిపోయే వాళ్శలో తాను కూడా ఒకడని అంటూ ఇటీవల ఓభయంకరమైన నిజాన్ని తన అభిమానులుకు తెలియజేశారు. ఇటీవల పీర్స్ మోర్గాన్ కిఇచ్చినటువంటి ఇంటర్యూలో పీర్స్ మోర్గాన్ డ్రగ్స్ మిమ్మల్ని ఇంక ఎన్ని రోజులలో చంపబోతుంది అన్న ప్రశ్నకు సమాధానంగా సర్ ఎల్టన్ జాన్ సమాధానమిస్తూ నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే నేను డ్రగ్స్ తీసుకోని క్రింద పడిపోతే కొంతమంది నన్ను తీసుకువెళ్శి బెడ్ మీద పడుకోపెట్టేవిధంగా నామీద నాకు పట్టుతప్పిపోయానని అన్నారు.
ఈడ్రగ్స్ నన్ను ఎంతలా ఆవహించాయంటే కోన్నిరోజులు ఐతే నేను సిగరెట్లుతోపాటు, జానీ వాకర్ మందు తాగుతూ మూడు లేదా నాలుగు రోజులు పాటు అలానే ఉంటాను. దానితోపాటు ఒకోరోజు పడుకుంటే దాదాపు రెండు రోజులు వరకు నాకు మెలకువ లేకుండా నిద్రపోతాను. ఎప్పుడైతే మరలా ఆకలిగా అనిపిస్తుందో మరలా అప్పుడే నిద్రలేస్తానని అన్నారు. నిద్రలేచిన తర్వాత శాండ్ విచెస్ తోపాటు ఒక ఐస్ క్రీమ్ లాంటివి కడుపు నిండా తినేస్తాను అన్నారు. ఇంత ట్రాజిక్ గా ఉంటుంది నాజీవితం డ్రగ్స్ తీసుకుంటే అని అన్నారు.
నేను ఎప్పుడూ నాకునేనుగా డ్రగ్స్ కుబానిసను కాలేదు. డ్రగ్స్ కుబాసిసలు అయినవారు ఐతే నాకంటే మరీ ప్రమాదకరంగా తయారవుతారు. డ్రగ్స్ తీసుకునే వాళ్శు సూదులను వారియొక్క చేతిభాగంలో గుచ్చుకోని గుచ్చుకోని సూదులు కూడా వారిశరీరంలో దిగిపోతాయి అంతలా ఉంటారని అన్నారు. అలాంటి వారిని చూస్తుంటే నాకు కూడా చాలా భయమేస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











