twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sean Connery no more: సినీ రంగాన్ని శాసించిన 007.. పాల అబ్బాయి నుంచి ప్రపంచం గర్వించే నటుడిగా

    |

    జేమ్స్ బాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని అభిమానులుగా మార్చుకొన్న సీన్ కానరీ ఇకలేరు. బెహమస్‌లోని నాసావ్‌లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించినట్టు బీబీసీ ప్రసారం చేయడంతో ఇక్కసారిగా అభిమానులు, సినీ లోకం నివ్వెరపోయింది. ఆయన మరణానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో అభిమానులుగా మలుచుకొన్న ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలు..

    లారీ డ్రైవర్ కొడుకుగా

    లారీ డ్రైవర్ కొడుకుగా

    సీన్ కానరీ 1930 ఆగస్టులో 25వ తేదీన స్కాట్ లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లోని ఫౌంటేయిన్ బ్రిడ్జ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఓ ప్యాక్టరీలో లారీ డ్రైవర్. సీన్ కానరీ అసలు పేరు థామస్ సీన్ కానరీ.. తాత థామస్‌ పేరును తన పేరుతో జతచేసుకొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన సీన్ కానరీ జీవితంలో చాలా అనూహ్యమైన మలుపులు చోటుచేసుకొన్నాయి. తన ఉద్యోగ జీవిత ఆరంభంలో రాయల్ నేవీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సైన్యం నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత పాల వ్యాపారిగా మారి కోఆపరేటివ్ సోసైటికి సేవలందించారు. తాను ఉంటే ప్రాంతంలో పాలను సరఫరా చేసే పనిని చేపట్టారు. ఆ తర్వాత జీవితాన్ని కొనసాగించేందుకు పలు ఉద్యోగాలు మారాల్సి వచ్చింది.

    బ్యాక్ స్టేజ్ ఆర్టిస్టు నుంచి జేమ్స్‌బాండ్‌గా

    బ్యాక్ స్టేజ్ ఆర్టిస్టు నుంచి జేమ్స్‌బాండ్‌గా


    1951లో కింగ్స్ థియేటర్‌లో బ్యాక్ స్టేజ్ ఆర్టిస్‌గా ప్రారంభించడం ద్వారా థియేటర్‌ రంగంలోకి ప్రవేశించారు. పలు సంవత్సరాలపాటు కోరస్ బాయ్‌గా చిరు ఉద్యోగం చేశాడు. 1957‌లో నో రోడ్ బ్యాక్ అనే చిత్రంలో నటుడిగా సీన్ కానరికీ తొలి అవకాశం వచ్చింది. ఆ తర్వాత నటుడిగా వెనుకకు తిరిగి చూసుకోలేదు.

    రాజకీయాల్లోకి... స్కాట్లాండ్ విముక్తి కోసం

    రాజకీయాల్లోకి... స్కాట్లాండ్ విముక్తి కోసం

    నటుడిగానే కాకుండా సీన్ కానరీ రాజకీయాలతో కూడా అనుబంధాన్ని పంచుకొన్నారు. స్కాటిష్ నేషనల్ పార్టీతో సభ్యుడిగా ఉన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి స్కాట్లాండ్‌కు విముక్తి కల్పించాలని ప్రచారం చేశారు. పార్టీకి ఆర్థికంగా కూడా సహాయం అందించాడు. 2001 స్కాటిష్ నేషనల్ పార్టీని బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో తన రాజకీయ ప్రయాణం అక్కడితో నిలిచిపోయింది.

    సినిమా చరిత్ర ఉన్నంత కాలం...

    సినిమా చరిత్ర ఉన్నంత కాలం...

    నటుడిగా మారిన తర్వాత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన జెమ్స్ బాండ్ 007 పాత్ర ఆయనను వెతుక్కొంటూ వచ్చింది. ఆ తర్వాత సినీ ప్రపంచంలో తనకంటూ చరిత్రను లిఖించుకొన్నాడు. భౌతికంగా సీన్ కానరీ ప్రస్తుతం మన మధ్య లేకుండా సినిమా ఉన్నంత కాలం ఆయన నటించిన జేమ్స్‌బాండ్ పాత్ర ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

    English summary
    Sir Thomas Sean Connery was a Scottish actor and producer. He was best known as the first actor to portray the character James Bond in film, starring in seven Bond films. He acted in Dr. No to You Only Live Twice, plus Diamonds Are Forever and Never Say Never Again between 1962 and 1983
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X