twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించిన జేమ్స్‌బాండ్ ‘స్కైఫాల్’

    By Bojja Kumar
    |

    Skyfall
    లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ చిత్రాల పరంపరలో 23వ చిత్రంగా విడుదలైన 'స్కైఫాల్' కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించింది. జేమ్స్ బాండ్ సినిమాల చరిత్రలోనే 1 బిలియన్ డాలర్లుకు(100 కోట్ల డాలర్లు లేదా 1000 మిలియన్ డాలర్లు) పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. 2012 సంవత్సరంలో బిలియన్ డాలర్లు క్రాసైన సినిమాల్లో 'స్కైఫాల్' 3వది.

    దీనికంటే ముందు 'ది అవేజర్స్', 'ది డార్క్ నైట్ రైసెస్' చిత్రాలు 1.51 బిలియన్ డాలర్లు, 1.08 బిలియన్ డాలర్ల చొప్పున వసూలు చేసాయి. ఓవరాల్‌గా బిలియన్ డాలర్ల మార్కు దాటిన సినిమాల్లో 'స్కైఫాల్' చిత్రం 14వది. స్కైఫాల్ చిత్రం దేశీయంగా ఈ చిత్రం 289.6 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, విదేశాల్లో 710.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    డేనియల్ క్రూగ్, హెలిన్ మెక్రోలి, బెరిన్స్‌మర్లోహ్, జావియర్ బార్టెన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సేమ్ మెండిస్ దర్శకత్వం వహించారు. 12 దేశాల్లో రేర్ లొకేషన్లలో తెరకెక్కించారు. శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన 'స్కైఫాల్' మూవీ.....బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.

    బాండ్ సినిమాలు మొదలయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ చిత్రంగా రూపొందిన 'స్కైఫాల్' చిత్రం నవంబర్ 1న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలైంది. ఈ చిత్రంలో క్రెయిగ్, జుడి డెన్చ్‌లు నాయక, ప్రతినాయకులుగా నటించారు. ఫ్రెంచ్ నటి బెరెనిస్ మార్లో మరో ప్రత్యేక పాత్రలో కనువిందు చేసింది.

    English summary
    Sony and MGM have plenty to toast about as Skyfall rings out 2012 by crossing the $1 billion mark in global ticket sales. Skyfall has grossed $289.6 million domestically and $710.6 million internationally, becoming the highest grossing film in Sony's history and the first to jump $1 billion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X