ఇండియాలో...బాండ్ మూవీ ‘స్కైఫాల్’ కలెక్షన్స్
ముంబై : లేటెస్ట్ జేమ్స్ బాండ్ మూవీ 'స్కైఫాల్' ఇండియన్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించడమే కాదు...హాలీవుడ్ సినిమాల్లోకెల్లా అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన రెండో సినిమాగా రికార్డ్ సృష్టించింది. నవంబర్ 1న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్(4 రోజులు)లో రూ. 27.5 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 34.5 కోట్లు వసూలు చేసింది.
సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 1న ఈచిత్రాన్ని 907 ప్రింట్లతో దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏ 2డి హాలీవుడ్ సినిమా కూడా ఈ రేంజిలో విడుదల కాలేదు. మొత్తం నాలుగు భాషలు(ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం)ల్లో సినిమా విడుదలైంది.
శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన 'స్కైఫాల్' మూవీ..... బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.
బాండ్ సినిమాలు మొదలయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ చిత్రంగా రూపొందిన 'స్కైఫాల్' చిత్రం నవంబర్ 1న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే...స్కైఫాల్ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గత బాండ్ సినిమాలు చూసి సినిమా ఇలా ఉంటుందని వెళితే మాత్రం బోరింగ్ తప్పదు.


Click it and Unblock the Notifications











