జేమ్స్ బాండ్ మూవీ (స్కైఫాల్) టాకేంటి?
లాస్ ఏంజిల్స్: అద్భుత విన్యాసాలు, ఊహకందని టెక్నాలజీని ఉపయోగించే బాండ్ చేసే సాహసాలు, హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు, భారీ లొకేషన్స్.....వెరసి జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను పెంచాయి. బాండ్ సినిమాలు మొదలయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ చిత్రంగా రూపొందిన 'స్కైఫాల్' చిత్రం నవంబర్ 1న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలైంది.
శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన 'స్కైఫాల్' మూవీ..... బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.
గత జేమ్స్ బాండ్ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల ఆశించిన రేంజిలో లేవనే చెప్పాలి. సినిమా మొదట్లో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం బాండ్ ఇరగదీసాడు. అయితే గత బాండ్ సినిమాల్లో మాదిరి ఇందులో ఏజెంట్ OO7 ప్రేక్షకులను ఆశ్యర్యానికి గురి చేసే గ్యాడ్జెట్స్ ఏమీ ఉపయోగించలేదు. కేవలం అతని ఆలోచనతోనే పని కానిస్తూ ఉంటాడు.
దర్శకుడు శామ్ మెండిస్ ప్రతి సన్నివేశాన్ని రియల్‌గా చూపించాలని చూసాడు. అందుకే అత్యాధునిక పరికరాలు బాండ్ కోసం ఉపయోగించలేదు. అదే విధంగా రొటీన్ యాక్షన్ సన్నివేశాలను బారీగా జొప్పించలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే...స్కైఫాల్ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గత బాండ్ సినిమాలు చూసి సినిమా ఇలా ఉంటుందని వెళితే మాత్రం బోరింగ్ తప్పదు.
చివరగా చెప్పేదేమిటంటే....స్కైఫాల్ సినిమా జేమ్స్ బాండ్ మూవీ అనుభూతి కలిగించేలా తరకెక్కించడంలో దర్శకుడు శామ్ మెండిస్ విఫలం అయ్యాడు. దీన్ని జేమ్స్ బాంబ్ మూవీ అనడం కంటే సాదాసీదాగా సాగే గూడచారి నేపథ్య సినిమా అనడం బెటర్.


Click it and Unblock the Notifications











