హాలీవుడ్ తారల గుండెల్లో దడ పుట్టిస్తున్న స్లమ్ డాగ్ భామ
సాహసానికి వెనుకడుగు వేయని హాలీవుడ్ భామల గుండెల్లా దడా..?? ఇదేంటబ్బా..? అనుకుంటున్నారు కదూ..!? హాలీవుడ్ అగ్రశ్రేణి తారల గుండెల్లో ఈ మధ్య దడ పుట్టేస్తుందట. దీనికి కారణమేమిటో తెలుసా.? మన ఫ్రిడా పింటోనే. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ ఫ్రిడా పింటో ఈ మధ్య, బాండ్ గర్ల్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో హాలీవుడ్ భామలకు చాలా భయమేస్తోందట.
హాలీవుడ్ సెక్సీ భామలను పక్కకు నెట్టి జేమ్స్ బాండ్ లో చోటు సంపాదించుకున్న ఫ్రిడా, ఇస్టే లౌడర్ కాస్మటిక్ ప్రకటన పైనా కన్నేసినట్లు తెలిసింది. దీంతో హాలీవుడ్ నటి గినెత్ పాల్టో ఆందోళనకు గురైందని వార్తలు గుప్పుమన్నాయి. ఇస్టే లౌడర్ ఉత్పత్తుల ప్రచారం ద్వారా పాల్టో భలే సంపాదిస్తోందని, ఈ భారీ కాంట్రాక్ట్ ఫ్రిడా కారణంగా చేజారిపోతుందేమోనని గినెత్ తెగ బాధపడిపోతుందట.
ఇంకా చెప్పాలంటే.. ఇస్టే లౌడర్ ప్రకటనలో స్లమ్‌డాగ్ హీరోయిన్ ను నటింపజేసేందుకు ఆ సంస్థకు చెందిన అధికారులు ఫ్రిడాతో చర్చలు జరుపుతున్నారని తెలిసి గినెత్ ఇంకా మండిపడుతోందట..!


Click it and Unblock the Notifications











