For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కాబోయే భర్తకు అలాంటి షాక్!

  |

  ఆస్కార్ అవార్డుల్లో సంచలనం రేపి పలు పురస్కారాలు అందుకొన్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి ఫ్రైడా పింటో. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలపై మోజు పెంచుకొని బాలీవుడ్‌కు దూరమైంది. అయితే తాజాగా మరోసారి దేశీయ మీడియాలో ఫ్రైడా పింటో పతాక శీర్షికలను ఆకర్షించింది. పెళ్లికాక ముందే కాబోయే భర్తతో తొలి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో పాపులర్

  స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో పాపులర్

  స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా రిలీజ్ తర్వాత ఆ మూవీలో నటించిన దేవ్ పటేల్‌తో డేటింగ్ చేసింది. ఆరేళ్లపాటు అఫైర్ కొనసాగించిన ఫ్రైడా పింటో ఆ తర్వాత అనూహ్యంగా విడిపోయారు. పెళ్లి చేసుకొంటారని అందరూ అనుకొంటుండగా వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడం సన్నిహితులు, స్నేహితులను దిగ్బ్రాంతికి గురిచేసింది.

  స్లమ్ డాగ్ మిలియనీర్ మిలియనీర్ తర్వాత

  స్లమ్ డాగ్ మిలియనీర్ మిలియనీర్ తర్వాత

  స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా తర్వాత రైస్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ తిష్నా, లవ్ సోనియా, మోగ్లీ: లెజెండ్ ఆఫ్ ది జంగిల్ , లవ్ వెడ్డింగ్, రిపీట్, హిల్‌బిల్ ఎలేజీ చిత్రాల్లోనటించింది. అయితే ఊహించినంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేకపోయింది. ఆ తర్వాత మహిళా చైతన్యం, అణగారిన పేద పిల్లల కోసం తీసిన డాక్యుమెంటరీలో హాలీవుడ్ తారలు మెరిల్ స్ట్రీప్, అన్నే హాత్‌వే, కేట్ బ్లాంచెట్, సుస్మిత సేన్, ప్రియాంక చోప్రా, సల్మా హయక్‌తో పాటు కలిసి నటించింది.

  అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్

  అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్


  ఇలాంటి పరిస్థితుల మధ్య దేవ్ పటేల్ బ్రేక్ తర్వాత ఫ్రైడా పింటో గత కొద్దికాలంగా కారీ ట్రాన్ అనే అనే అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తున్నారు. 2019 నవంబర్‌లో వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. కారీ ట్రాన్‌తో నిశ్చితార్థం జరిగిన వెంటేనే నా జీవితంలోకి అద్బుతమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. కాబోయే శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. అయితే పెళ్లి కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

  త్వరలోనే బుల్లి కారీ ట్రాన్

  త్వరలోనే బుల్లి కారీ ట్రాన్


  అయితే తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో బుల్లి కారీ రాబోతున్నాడు.. కొద్ది రోజుల్లోనే తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అంటూ ఫ్రైడా పింటో ఓ మెసేజ్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దాంతో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులందరూ షాక్ గురయ్యారు. యువ హీరోయిన్ మృణాళ్ థాకూర్ ఈ వార్తను చూసి.. ఓ మై గాడ్ అంటూ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత మీ ఇద్దరికి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ పోస్టు చేసింది.

  ఫ్రైడా పింటో కెరీర్ ఇలా...

  ఫ్రైడా పింటో కెరీర్ ఇలా...


  ఇక ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే.. ఫ్రైడా పింటో నీడిల్ ఇన్ ఏ టైమ్‌స్టాక్ అనే చిత్రంలో దర్శకుడు జాన్ రిడ్లీ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. మిస్టర్ మాల్కమ్ లిస్ట్ అనే చిత్రంలో కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నాయి.

  English summary
  Slumdog Millionaire fame Freida Pinto reveals her pregnancy with cory tran. She wrote instagram post that.. Baby Tran, coming this Fall!. Apart from this.. Freida Pinto had break up with Dev Patel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X