'స్లమ్ డాగ్ మిలీనియర్' కుర్రాడితో తీస్తున్నారు
కెన్నాస్: గణిత మేధావి రామానుజన్ జీవిత చరిత్ర హాలీవుడ్ తెరపై కూడా ప్రదర్శితం కానుంది. రెండు నెలల క్రితం ఈ తమిళ చిత్రం తెరకెక్కింది. ఇందులో రామానుజన్ పాత్రలో అభినయ్, ఆయన సతీమణి పాత్రలో 'ఎల్లాం అవన్ సెయల్' ఫేం భామ నటించారు. సహజత్వం కోసం కుంభకోణంలో రామానుజం నివసించిన ఇల్లు, ఆయన చదివిన లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇప్పుడీ కథ హాలీవుడ్‌లోనూ సందడి చేయనుంది. 'ది మాస్టర్ హౌ న్యూ ఇన్ఫినిటీ' పేరిట ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో రామానుజన్ పాత్రలో 'స్లమ్ డాగ్ మిలీనియర్' చిత్ర నటుడు దేవ్ పటేల్ నటిస్తుండగా... ఆయన భార్య పాత్రలో దేవిక భిసే కనిపించనున్నారు. కుంభకోణం, పుదుచ్చేరిలోనూ షూటింగ్ చేశారు. చెన్నైలో హార్బరు ప్రాంతంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. నటీనటుల మేకప్ స్టిల్స్ కూడా బయటకు రానీయడం లేదు చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











