వివాహం టెలికాస్ట్ చేయడం సౌకర్యంగా లేదు
హాలీవుడ్ సెక్సీ హీరోయిన్, సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్, ఆమె మాజీ భర్త క్రిస్ హాంప్రస్ పెళ్లిపై ఇన్నాళ్లకు పెదవి విప్పారు. క్రిస్ హాంప్రస్‌ని ఎంతగానో ప్రేమించి అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకోని 72 రోజుల గడిచిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ గతయేడాది క్రిస్ హాంప్రస్‌తో జరిగిన నా వివాహాన్ని రెండు ఎపిసోడ్స్‌గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడం అంత సౌకర్య వంతంగా అనిపించలేదని స్పష్టం చేశారు. నా గుండెని కొంచెం కాపాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాపై నేను చాలా ఆసక్తిని చూపించాను. మీరు పెద్ద వివాహాన్ని టెలివిజన్‌లో చూపిస్తున్నప్పడు ఇబ్బందిపడలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సందర్బంలో నేను చూసేందుకు కెమెరాలు లేవు. మీరు కేవలం మిమ్మల్ని రక్షించుకునేందుకు కెమెరాలను కావాలని భావిస్తున్నాను.
కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ఇష్టపడి బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రిస్‌ని అక్టోబర్ 31న పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని 72 రోజులకే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య విడాకులకు కారణం ఏమిటా అని ఆరా తీసిన ఇంటర్నేషనల్ మీడియా ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ ఇద్దరి పెళ్లి వ్యవహారం విడాకుల వరకు వెళ్లడానికి కారణం ఓ యోగా గురువు.
అతడి దగ్గర కిమ్ శిష్యరికం చేసినందుకే క్రిస్ కు చిర్రెత్తింది. యోగా నేర్చుకోవడంలో తప్పేమీ లేక పోయినా..... యోగా గురువు ప్రవర్తన కిమ్ మొగుడు క్రిస్ కు నచ్చలేదు. ఎందుకంటే అతడు నగ్నంగా యోగా పాఠాలు నేర్పిస్తాడు. ఇది నచ్చని క్రిస్ అతని క్లాసులకు వెళ్లొద్దని కిమ్ ను వారించాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి విడాకులు తీసుకునే రేంజ్ కి విబేధాలు పెరిగాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











