»   » అయ్యో ఇదే రొమాన్స్ .. వినాయకుడు, బుద్దుడి ముందే శృంగారమా? సోఫియా హయత్ వీడియో వైరల్

అయ్యో ఇదే రొమాన్స్ .. వినాయకుడు, బుద్దుడి ముందే శృంగారమా? సోఫియా హయత్ వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బ్రిటీష్ సంతతికి చెందిన నటి, మోల్ సోఫియా హయత్ సంచలనాలకు మారుపేరు. సినిమాలు, మోడలింగ్ ప్రాజెక్టుల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ గతేడాది సడన్‌గా నన్‌ (క్రైస్తవ సన్యాసి)గా మారడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో రుమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాడ్ స్టానెస్కు‌ను పెళ్లాడి మరో సంచలనానికి కారణమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోఫియా తన భర్తతో అతిసన్నిహితంగా శృంగారం జరిపే ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఉత్సాహపరుస్తున్నది. అలా జీవితాన్ని కొనసాగిస్తూ తాజాగా భర్తతో అతి శృంగార సన్నివేశాలతో షూట్ చేసిన మ్యూజిక్ వీడియోను ఇంటర్నెట్‌లోకి వదిలింది.

  లవ్ మేకింగ్ వీడియో

  లవ్ మేకింగ్ వీడియో

  కొత్తగా రూపొందించిన మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది. దాని పేరు ఓం శాంతి ఓం. నా యూట్యూబ్ చానెల్‌లో పూర్తి వీడియోను చూడండి. పూర్తిగా చూస్తేనే ఓం అశాంతి ఓం కథ గురించి తెలుస్తుంది అని సోఫియా ప్రకటన చేసింది. అయితే పడక గదిలో జరుపుకోవాల్సిన శృంగారాన్ని దేవుళ్ల పటాలు, విగ్రహాల ముందు ప్రదర్శించడంపై నిరసన వ్యక్తమవుతున్నది.

  క్రైస్తవ సన్యాసిగా.. భర్త పూజారిగా

  క్రైస్తవ సన్యాసిగా.. భర్త పూజారిగా

  తాజాగా సోఫియా హయత్ రూపొందించిన మ్యూజిక్ అల్బమ్ పేరు ఓం శాంతి ఓం. తన భర్తతో శృంగారంగా ఉంటూ మతం, శృంగారం, అధ్యాత్మిక విషయాలను వెల్లడించడం ఈ మ్యూజిక్ వీడియో ప్రత్యేకత. ఈ వీడియోలో భర్తతో రొమాన్స్ చేస్తూ చివర్లో మళ్లీ క్రైస్తవ సన్యాసి వేషధారణలో కనిపించగా, ఆమె భర్త హిందూ పూజారిగా దర్శనమివ్వడం గమనార్హం.

  భజనలతో శృంగారం

  సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ఫొటోలను ప్రదర్శించే సోఫియా తన తాజా వీడియోలో భర్తతో శృంగారానికి భజనలు జోడించింది. అంతేకాకుండా వినాయకుడు, బుద్ధుడి ముందు శృంగారం జరపడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సోఫియా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్లను డిలీట్ చేసింది. సోఫియా తీరుపై ఇన్స్‌టాగ్రామ్‌లో రచ్చ రచ్చ అవుతున్నది.

  మ్యూజిక్‌ వీడియోలో అజాన్

  మ్యూజిక్‌ వీడియోలో అజాన్

  ఈ మ్యూజిక్ వీడియోలో అనేక వివాదాస్పద అంశాలు కనిపిస్తున్నాయి. శృంగారం జరుపే సమయాల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో మసీదుల్లో వినిపించే అజాన్‌ కూడా ఉండటం మరింత వివాదంగా మారింది. గతంలో గాడ్ ఈజ్ సెక్సువల్.. అర్గాసమ్ ఈజ్ గాడెస్ ఎనర్జీ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సోఫియా విడుదల చేసిన లవ్ మేకింగ్ మ్యూజిక్ వీడియో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది.

  English summary
  Sofia Hayat's lessons on sex and intimacy continues, as now the former model is out with a lovemaking music video with her husband. She turned a nun last year, and shocked everyone with her marriage to Romanian interior designer, Vlad Stanescu this April. And now is out with a music video with her husband. Produced, written and sung by Sofia her music video is called Om Shanti Om!! and is her big opportunity at giving lesson on lovemaking.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more