బైసెక్సువల్ లవర్స్ గా రొమాన్స్ సీన్లు ...
హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సోఫియా వెర్గారా మరియు షెరాన్ స్టోన్ రాబోయే చిత్రం 'ఫేడింగ్ గిగోలో' బైసెక్సువల్ లవర్స్‌గా నటించనున్నారు. 54 సంవత్సరాల వయసు కలిగిన షెరాన్ స్టోన్ చర్మ వ్యాధులను నయం చేసే డాక్టర్‌గా నటిస్తూ 39 సంవత్సరాల వయసు కలిగిన సోఫియా వెర్గారాతో రోమాన్స్ చేసిన సన్నివేశాల సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తాయని హాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకి సంబంధించి రెండవ టాకీ పార్ట్ ఏప్రిల్ నుండి న్యూయార్క్ సిటీలో జరగనుంది.
ఈ సందర్బంలో సోఫియా వెర్గారా లైఫ్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యులో లెజెంజరీ హీరోయిన్ అయిన షెరాన్ స్టోన్‌తో కలసి నటించడం చాలా ఫన్నీగా ఉందని అన్నారు. నిజంగా మా ఇద్దరి మద్య ఉన్న సీన్లు చాలా స్టీమీగా ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం జాన్ తర్టారో వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్ తర్టారోతో పాటు వుడీ అలెన్ ఒక తార్పుడుకాడు గా కనిపిస్తాడు.


Click it and Unblock the Notifications











