నగ్నంగా అందాల విందు చేసిన టీవీ స్టార్
లాస్ ఏంజిల్స్: కొలంబియన్ అమెరికన్ నటి, మోడల్, టీవీ స్టార్ సోఫియా వెర్గరా ‘వానిటీ ఫెయిర్'మేగజైన్ మే 2015 సంచిక కవర్ పేజీ కోసం నగ్నంగా అందాల విందు చేసింది. అమెరికన్ టీవీ కార్యక్రమం ‘ది ఎలెన్ షో' పాల్గొన్న సోఫియా వెర్గరా త్వరలో తాను ప్రియుడు, అమెరికన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ జోయీ మాంగనెల్లోనె పెళ్లాడబోతున్నట్లు క్లూ ఇచ్చింది. ఆమె చేతికి ఎంగజ్మెంట్ రింగ్ కూడా ఉంది. సోఫియా కంటే అతడు నాలుగేళ్లు చిన్నవాడు. ఆమె వయసు 42, అతని వయసు 38. సోఫియాకు ఇది రెండో పెళ్లి.
సోఫియా వెర్గరా గురించిన వివరాల్లోకి వెళితే....అత్యధికంగా సంపాదిస్తూ ఫోర్భ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న నటి. ఫోర్బ్స్ జాబితా వివరాల ప్రకారం....లాటిన్ అమెరికా దేశాల్లో బాగా పాపులర్ అయిన ‘మోడర్న్ ఫ్యామిలీ' అనే టీవీ కార్యక్రమంలో నటిస్తున్న సోఫియా వెర్గరా 2013 జూన్ నెల నుండి 2014 జూన్ నెల వరకు ఆమె సంపాదన 37 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ. 223 కోట్లు. ఈ ఏడాది కూడా ఆమె సంపాదన అదే రేంజిలో ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఈ డబ్బంతా ఆమె కేవలం నటించడం వల్లనే వస్తుందనుకుంటే పొరపాటే. ఆమె టీవీ కార్యక్రమాల్లో నటించడం కంటే.....ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తోంది. దీంతో పాటు ఆమెకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. మల్టీ మిలియన్ డాలర్ టాలెంట్ మనేజ్మెంట్ సంస్థతో పాటు మార్కెటింగ్ ఫిర్మ్, లాటిన్ వరల్డ్ ఎంటర్టెన్మెంట్ సంస్థలకు ఆమె కో ఫౌండర్. కొన్ని రోజుల క్రితం తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











