సెక్సీ టీవీ స్టార్ సంపాదన వందల కోట్లలో....
లాస్ ఏంజిల్స్: టీవీ కార్యక్రమాల్లోనటించే స్టార్లు కూడా సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. అయితే వీరంతా మన ఇండియన్ టీవీ స్టార్లు కాదు. అమెరికన్ టీవీ స్టార్స్. ప్రపంచంలో ధనవంతులైన టీవీ స్టార్ల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా విడుదల చేసింది.
ఫోర్బ్స్ జాబితా వివరాల ప్రకారం....లాటిన్ అమెరికా దేశాల్లో బాగా పాపులర్ అయిన ‘మోడర్న్ ఫ్యామిలీ' అనే టీవీ కార్యక్రమంలో నటిస్తున్న సోఫియా వెర్గరా అనే నటి అత్యధికంగా సంపాదిస్తూ ఈ జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. 2013 జూన్ నెల నుండి 2014 జూన్ నెల వరకు ఆమె సంపాదన 37 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ. 223 కోట్లు.

అయితే ఈ డబ్బంతా ఆమె కేవలం నటించడం వల్లనే వస్తుందనుకుంటే పొరపాటే. ఆమె టీవీ కార్యక్రమాల్లో నటించడం కంటే.....ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తోంది. దీంతో పాటు ఆమెకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. మల్టీ మిలియన్ డాలర్ టాలెంట్ మనేజ్మెంట్ సంస్థతో పాటు మార్కెటింగ్ ఫిర్మ్, లాటిన్ వరల్డ్ ఎంటర్టెన్మెంట్ సంస్థలకు ఆమె కో ఫౌండర్. కొన్ని రోజుల క్రితం తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ కూడా విడుదల చేసింది.
ఇక మేల్ టీవీ యాక్టర్లలో అమెరికన్ టీవీ స్టార్ ఆస్టన్ కుచ్చర్ 26 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు. సోఫియా వెర్గెరా, ఆస్టన్ కుచ్చర్ కలిసి గత సంవత్సరం ‘టూ అండ్ ఎ ఆఫ్ మెన్' అనే టీవీ కార్యక్రమంలో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











