twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు జరిగింది... ట్రైలర్ బదులు సినిమా మొత్తం యూట్యూబ్‌లో పెట్టేశారు!

    By Bojja Kumar
    |

    సినిమా విడుదల ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా యూట్యూబ్‌లో ట్రైలర్ విడుదల చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే ట్రైలర్ అప్‌లోడ్ చేయబోయి మిస్టేకెన్లీ సినిమా అప్ లోడ్ చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టెన్మెంట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలో ఇలాంటి తప్పిదం జరుగడం చర్చనీయాశం అయింది.

    జులై 3న ఉదయం ఈ సంఘటన చోటు చేసుకోగా.... ఆ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ అయిన వారందరికీ మొబైల్, డెస్క్ టాప్ నోటిఫికేషన్లు వెళ్లాయి. కొందరు సినిమా ఆల్రెడీ చూశారు కూడా. 'ఖలీ ది కిల్లర్' అనే సినిమా విషయంలో ఈ తప్పు జరిగి పోయింది. అయితే పొరపాటు గమనించిన సోనీ సంస్థ దాన్ని డిలీట్ చేసింది.

    Sony accidentally uploaded an entire movie to YouTube instead of a trailer

    డిలీట్ చేసిన తర్వాత.... ప్రస్తుతం రెంటెడ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఆ తప్పిదం కారణంగా ఫ్రీగా చూసే అకాశం కొందరికి మాత్రమే దక్కింది. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సినీ అభిమానులు సినిమా మిస్సయ్యామే అని బాధ పడుతున్నారట.

    అనుకోకుండా జరిగిన ఈ తప్పిదం వల్ల సంస్థకు కొంత నష్టం వాటిల్లిందని, కొందరు ఈ సినిమాను యూట్యూబ్ నుండి డౌన్ లోడ్ చేసుకున్నట్లు టాక్. క్రైమ్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జాన్ మాథ్యూస్ దర్శకత్వం వహించారు.

    English summary
    In an attempt to upload a trailer for its upcoming DVD and digital download release of the movie "Khali the Killer," someone at Sony apparently uploaded the entire 89-minute film to YouTube Tuesday morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X